
చెలరేగిన రాయల్స్ బ్యాటర్లు..
పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. కెప్టెన్ సంజు శాంసన్-55, దేవ్‌దత్ పడిక్కల్-41, జోస్ బట్లర్-35, షిమ్రోన్ హెట్‌మైర్- 32 పరుగులు చేశారు. వీరందరి స్ట్రైక్ రేట్ 125 నుంచి 246 వరకు రికార్డయింది. సన్‌రైజర్స్ బౌలర్లు ఉమ్రాన్ మలిక్, టీ నటరాజన్ రెండు చొప్పున, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెప్పర్డ ఒక్కో వికెట్ పడగొట్టారు.

61 పరుగుల తేడాతో..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన సన్‌రైజర్స్ టీమ్.. ఇన్నింగ్ ముందు నుంచీ తడబడుతూనే సాగింది. రాజస్థాన్ బౌలర్ల ధాటికి చేతులెత్తేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. 61 పరుగుల తేడాతో పరాజయాన్ని చవి చూసింది. మిడిలార్డర్‌లో ఎయిడెన్ మార్క్‌రమ్-57, లోయర్ ఆర్డర్‌లో వాషింగ్టన్ సుందర్-40, రొమారియో షెప్పర్డ్-24 మినహా మరెవరూ సింగిల్ డిజిట్‌ను దాటలేకపోయారు. రాయల్స్ బౌలర్లలో యజువేందర్ చాహల్ మూడు వికెట్లు తీశాడు. ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ రెండు చొప్పున వికెట్లు పడగొట్టారు.

ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం..
ఈ పరాజయం పట్ల కేప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. ఈ ఓటమి నుంచి బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పాడు. తమ ప్లాన్ అంతా బాగున్నా.. దాన్ని సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయామనని పేర్కొన్నాడు. వచ్చే మ్యాచ్‌ల కోసం మరింత పక్కాగా ప్రణాళికలను వేసుకుంటామని, అంతే పక్కాగా దాన్ని గ్రౌండ్‌లో అమలు చేస్తామని అన్నారు. ఫాస్ట్ బౌలర్ ఉమ్రన్ మలిక్ 150 కిలోమీటర్ల వేగంతో బంతులు వేయడం, అందులో నిలకడను సాధించడం జట్టుకు అదనపు బలం అవుతుందని చెప్పాడు.
దెబ్బ తీసిన నో బాల్స్..
బౌలర్లు నో బాల్స్ వేయడం జట్టుపై ఒత్తిడిని పెంచిందని కేన్ విలియమ్సన్ చెప్పాడు. లాజికల్‌గా కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయని, బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను ఇంప్రూవ్ చేసుకుంటామని అన్నాడు. టీ20 ఫార్మట్‌లో ఎక్స్‌ట్రా రన్స్ అత్యంత విలువైనవని, ఏ జట్టయినా వాటిని నియంత్రించుకోవాల్సి ఉంటుందని, తాము అదే చేస్తామని వ్యాఖ్యానించాడు. ఎక్స్‌ట్రా డెలివరీలను వికెట్లు తీయడానికి ఉపయోగించుకోవవడం కష్టసాధ్యమని చెప్పాడు. అన్ని సందర్భాల్లోనూ అది సాధ్యం కాదని పేర్కొన్నాడు. బౌలింగ్ విభాగంలో ఉన్న లోపాలను గుర్తించి, సరి చేసుకుంటామని పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications
