Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మాది చెత్త నిర్ణయం కాదు.. ఇక వికెట్ల వేట, భారీ స్కోర్లే : RCB కోచ్

ఇటీవల ముగిసిన ఐపీఎల్ మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తీసుకున్న నిర్ణయాలపై మిశ్రమ స్పందన వస్తోంది. బౌలింగ్ అటాక్‌ను బలోపేతం చేసుకోవాలని వేలంలో అడుగుపెట్టిన బెంగళూరు ఫ్రాంచైజీ అంచనాలు లేని ప్లేయర్లపై భారీధర వెచ్చించింది. అయితే తమ నిర్ణయాలు సరైనవని, ప్రణాళిక ప్రకారమే సొంతం చేసుకున్నామని ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు.

వెస్టిండీస్ పేసర్ అల్జారీ జోసెఫ్ కోసం ఆర్సీబీ రూ.11.50 కోట్లు ఖర్చు పెట్టింది. అన్‌క్యాప్డ్ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ పేసర్ యశ్ దయాల్‌ కోసం రూ.5 కోట్లు వెచ్చించింది. అలాగే ఫెర్గూసన్‌ (రూ. 2 కోట్లు), టామ్‌ కరన్‌ (రూ. 1.50 కోట్లు), సౌరభ్‌ చౌహాన్‌ (రూ. 20 లక్షలు), స్వప్నిల్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)ను వేలంలో దక్కించుకుంది. వేలం కంటే ముందే ముంబయి ఇండియన్స్ నుంచి కామెరాన్ గ్రీన్‌ను ట్రేడింగ్ చేసుకుంది.

We have seen the potential of Yash Dayal. He can take wickets swinging with the new ball- RCB head coach Andy Flower

'' కామెరాన్ గ్రీన్ రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతంగా మారింది. నాలుగు, అయిదు స్థానాల్లో గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్ బ్యాటింగ్‌కు వస్తారు. ఆరో స్థానంలో దినేశ్ కార్తీక్ బరిలోకి దిగుతాడు. టాప్ ఆర్డర్‌లో డుప్లెసిస్, విరాట్ కోహ్లి, రజత్ పటిదార్ ఉంటారు. ఇది గొప్ప బ్యాటింగ్ ఆర్డర్. దీంతో మొదట బ్యాటింగ్ చేసినా, ఛేజింగ్‌లో అయినా భారీ స్కోరు సాధిస్తామని భావిస్తున్నాం''

''ఇక యశ్ దయాల్ విషయానికొస్తే.. గతేడాది అతడి సామర్థ్యాన్ని చూశాం. కొత్త బంతితో స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగలడు. కొన్ని సందర్భాల్లో అతడు విఫలమైనా ఎంతో కష్టపడ్డాడు. ఇప్పుడు మెరుగయ్యాడు. అతడి నుంచి గొప్ప ప్రదర్శన ఆశిస్తున్నాం. వేలంలో ప్యాట్ కమిన్స్ కోసం ప్రయత్నించాం. కానీ కుదరలేదు. అల్జారీ జోసెఫ్‌ను దక్కించుకున్నందుకు సంతోషంగా ఉన్నాం. అతడు నాణ్యమైన బౌలర్. డుప్లెసిస్‌తో కలిసి SA20లో ఆడాడు'' అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డుప్లెసిస్‌ కెప్టెన్సీలో జోసెఫ్ ఆడిన విషయం తెలిసిందే.

వేలానికి ముందు ఆర్సీబీ అంటిపెట్టుకున్న ఆటగాళ్లు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, కామెరాన్ గ్రీన్ (ట్రేడెడ్), రజత్ పటిదార్, అనుజ్ రావత్, దినేశ్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్ (ట్రేడెడ్), ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, విజయ్ కుమార్ వైషాక్

వేలానికి ముందు వదులుకున్న ఆటగాళ్లు: హసరంగ, హర్షల్‌, హేజిల్‌వుడ్‌, ఫిన్‌ అలెన్‌, బ్రేస్‌వెల్‌, విల్లీ, పార్నెల్‌, సోను యాదవ్‌, షాబాజ్‌ అహ్మద్‌, అవినాశ్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కేదార్‌ జాదవ్

Story first published: Monday, December 25, 2023, 13:31 [IST]
Other articles published on Dec 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+