Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త ఆటగాడికి మ్యాచ్ 'ఫినిషర్' రోల్‌: టాప్ ఆర్డర్‌లో ధోని

ధర్మశాల: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు సుదీర్ఘ కాలం 'మ్యాచ్ ఫినిషర్'గా వ్యవహరించిన వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన 'ఫినినర్' బ్యాటన్‌ను వేరొకరి చేతికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ మేరకు కొంత మంది ఆటగాళ్లను 'ఫినినర్లు' గా గుర్తించినట్లు వెల్లడించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ధర్మశాలలో ఆరంభం కానున్న తొలి వన్డేకు ముందు శనివారం ధోని మీడియాతో మాట్లాడాడు. అయితే 'ఫినినర్లు' గా గుర్తించిన వారి పేర్లను మాత్రం మీడియా ముఖంగా ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే వారు ఒత్తిడిని ఎదుర్కొంటారని తెలిపాడు.

ధోని సాధిస్తాడా?: ఒకవైపు దూకుడు, మరోవైపు ప్రతీకారం

'క్రికెట్‌లో మ్యాచ్‌ని ముగించడం కొంత కష్టం. అయితే ఈ బాధ్యతలను నిర్వర్తించేందుకు 6 నెలలు లేదా సంవత్సరం వరకు పట్టొచ్చు. ఇందుకు ఆత్మవిశ్వాసం ఉండాలి.' అని ధోని పేర్కొన్నాడు. మంచి ఫినిషనర్‌ని గుర్తిస్తే ఆ బ్యాటింగ్ ఆర్డర్‌లో ఆ ఆటగాడు 8 లేదా 10 సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉందన్నాడు.

We have identified a few players for 'finisher' role: MS Dhoni

ఉపఖండంలో ఫినిషర్‌గా ఉండే బ్యాట్స్‌మెన్ 5,6 లేదా 7 ఆర్డర్‌లో వస్తే బాగుంటుందని తెలిపాడు. ఇది ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ సఫలమైతే ఫినిషర్ పాత్ర పూర్తిగా మారుతుందని చెప్పాడు. పేస్‌ను దృష్టిలో పెట్టుకుని కూడా ఆలోచించాల్సి ఉందని ధోని పేర్కొన్నాడు.

ఆట తీరు అద్భుతం: కోహ్లీకి అనుకోని అతిథి ప్రశంస

'ఫినిషర్' కోసం ఇప్పటికే కొంతమంది ఆటగాళ్లను గుర్తించానని, ప్రస్తుతం అవి తన వద్దే ఉన్నట్లు ధోని వెల్లడించాడు. ఫినిషర్ రేసులో ఉన్న ఆటగాళ్ల పేర్లను వెల్లడిస్తే వారు ఒత్తిడికి గురవుతారనే తాను వెల్లడించడం లేదని తెలిపాడు. కాగా, ధర్మశాలలో ప్రారంభం కానున్న వన్డే మ్యాచ్‌లో ధోని టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే అవకాశం ఉందన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+