Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌లో 1.2 బిలియన్ జనాభా: హేలీ 'గౌరవం' వ్యాఖ్యలపై కోహ్లీ

హైదరాబాద్: బెంగుళూరు టెస్టులో విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేయడంతో అతడిపై ఉన్న గౌర‌వం త‌గ్గిపోతున్నదని ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హేలీ వ్యాఖ్యలను తాను పట్టించుకోనని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

బెంగుళూరు టెస్టు విజయానంతరం విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు తన జీవితంలో ఎటువంటి ప్రభావాన్ని చూపవని కోహ్లీ ఇయాన్ హేలీని ఉద్దేశించి అన్నాడు.

We have 1.2 billion people, I don't care about Ian Healy: Virat Kohli

'అతని దృష్టిలో నాపై గౌరవం పోయిం ఉండొచ్చు. కానీ భారత్‌లోని 120 కోట్లమంది గౌరవం మాకుంది. ఆ ఒక్కడి వల్ల నా జీవితంలో పెద్ద మార్పేమీ ఉండదు. సెంచూరియన్ (దక్షిణాఫ్రికా) టెస్టులో అతన్ని అంపైర్‌ అవుట్‌గా ప్రకటించినప్పుడు అతడు ఎలా ప్రవర్తించాడో, ఏమన్నాడో తెలుసుకునేందుకు యూట్యూబ్‌లో సెర్చ్‌ చేయండి. మీకే తెలిసిపోతుంది. ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడండి' అంటూ విలేకరులకు సూచించాడు. ఆస్ట్రేలియా తరుపున 119 టెస్టులాడిన ఇయాన్ హేలీ ఆల్ టైన్ గ్రేటెస్ట్ వికెట్ కీపర్లలో ఒకడిగా ఉన్నారు.

సెంచూరియన్ టెస్టులో రిగింది?

1997లో సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్‌ సందర్భంగా ఇయాన్‌ హేలీ అనుచితంగా వ్యవహరించాడు. బ్రేట్‌ షుల్జ్‌ బౌలింగ్‌లో బంతిని కీపర్‌ డేవ్‌ రిచర్డ్‌సన్‌ (ప్రస్తుత ఐసీసీ సీఈవో) అందుకోవడంతో అంపైర్ లెగ్‌సైడ్‌ క్యాచ్‌గా ప్రకటించాడు. ఈ టెస్టులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే తనను అవుట్‌గా ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన హేలీ మైదానంలోని ఓ ప్రేక్షకుడి వైపు బ్యాట్‌ను తుపాకీలా చూపించి బెదిరించాడు. అంతేకాకుండా డ్రేసింగ్‌ రూమ్‌ మెట్లు ఎక్కుతూ బ్యాట్‌ను కోపంగా విసిరేశాడు. (బు.. షి.. ఎంపైరింగ్‌) అంటూ అసభ్య వ్యాఖ్యలు చేశాడు.

కాగా, బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కోహ్లీ ఊరికే స్లెడ్జింగ్ చేస్తుండ‌టంపై అత‌ను అసంతృప్తి వ్యక్తంచేశాడు. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ప్రత్యర్థి ఆటగాడిని 'టాయిలెట్' అంటూ స్లెడ్జింగ్ చేయడం అతడిని అగౌరపరచడమేనని అన్నాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కోహ్లీ వ్యవహరించిన తీరు కూడా ఆహ్వానించదగ్గ పరిణామం కాదని తెలిపాడు. మైదానంలో కోహ్లీ ఈ తరహా మాటల యుద్ధానికి పుల్ స్టాఫ్ పెట్టి తన సహజ సిద్దమైన ఆటను ప్రదర్శిస్తే బాగుటుందని సూచించాడు.

కోహ్లీ దూకుడు తన జట్టు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచుతుందని, అశ్విన్ మొహంలౌ అది స్పష్టంగా కనిపిస్తోందని హేలీ చెప్పుకొచ్చాడు. 'కోహ్లీపై ఒత్తిడి పెరుగుతున్న‌ద‌ని అర్థ‌మ‌వుతోంది. అత‌నిపై ఉన్న గౌర‌వం పోతోంది. ప్ర‌త్య‌ర్థుల‌తో అత‌ను గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి. స్టీవ్ స్మిత్‌తో అత‌ను వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రైంది కాదు' అని హేలీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+