
క్రీజులో ఇద్దరు టాప్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు ఉన్న కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ప్రయోగించాం, కానీ ఆ వ్యూహం సఫలం కాలేదని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివరణ ఇచ్చాడు. సోమవారం రాత్రి వాంఖెడే మైదానంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. బెంగళూరు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో ఛేదించింది. డికాక్ (40), రోహిత్ (28), పాండ్యా (37 నాటౌట్; 16 బంతుల్లో 5పోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది.
మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... మేము మంచి క్రికెట్ ఆడామని భావిస్తున్నా. మొదటి ఆరు ఓవర్లలో మా బౌలింగ్ అంతగా బాగాలేదు. అయితే మధ్య ఓవర్లలో పుంజుకుని ముంబైని కట్టడి చేసాం. 19వ ఓవర్‌లో సాహసం చేసాం.. క్రీజులో ఇద్దరు కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌లు ఉన్న కారణంగా లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ప్రయోగించాం, కానీ ఆ వ్యూహం సఫలం కాలేదు' అని విరాట్ తెలిపారు.
'మంచు కారణంగా బౌలింగ్ చేయడం కష్టంగా మారింది. అయితే మొయిన్ అలీ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసాడు. ఈ విజయానికి ముంబై ఆటగాళ్లు అర్హులు. ఆటలో మొదట ఒత్తిడిని జయించాలి.. అప్పుడే విజయాలు వస్తాయి. గత రెండు మ్యాచుల్లోనూ మేము అదే చేసాం. మిగిలిన మ్యాచుల్లో విజయాలు సాదించేందుకు ప్రయత్నిస్తాం' అని విరాట్ ఆశాభావం వ్యక్తం చేసాడు.