For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంజలికి రోజంతా తలనొప్పి తెచ్చిపెట్టిన సచిన్ స్పీడ్...!

By Nageswara Rao

ముంబై: కారులో రోడ్డుపై వేగంగా దూసుకుపోతుంటే ఎంతో థ్రిల్‌గా ఉంటుంది. అదే బీఎమ్‌డబ్ల్యూ కారు అయితే ఆ స్పీడ్‌లో ఉండే మజానే వేరు. అయితే ఈ మితిమీరిన వేగమే ఒక సందర్భంలో సచిన్‌తో పాటు అతని భార్య రోజంతా తలనొప్పి తెచ్చిపెట్టిందట! ఈ విషయాన్ని సచినే స్వయంగా తెలియజేశాడు.

మోటార్ రేసింగును ఇష్టపడే సచిన్‌కు బీఎమ్‌డబ్ల్యూ సంస్థ వారు తమ పరిమిత ఎడిషన్ల కార్లలో ఒకదాన్ని టెస్ట్‌ డ్రైవ్‌ చేయమన్నారు. అంజలి కూడా వచ్చిన తన పక్కన కూర్చుందని, ఆ సమయంలో చాలా వేగంతో కారును నడిపానని తెలిపారు.

ఇంతలో బ్రేకులు చెక్‌ చేసుకోవాలని బీఎమ్‌డబ్ల్యూ సంస్థ వారి సూచన గుర్తొచ్చి సడన్‌ బ్రేక్‌ వేయడంతో కారు ఫోర్స్‌గా ఆగింది. దీంతో నేను అంజలి ముందుకు తూలిపడ్డామని, ఆ రోజంతా మా ఇద్దరికీ ఒకటే తలనొప్పి అంటూ సచిన్ తెలిపారు.

We had a headache for the entire day: Sachin Tendulkar narrates his encounter with mean machine

ఈ సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్‌లో ఉన్నప్పడు జరిగిందని గుర్గావ్ సెంటర్‌లో ఓ గేమింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో సచిన్ చెప్పారు. ఇక అంతర్జాతీయ బౌలర్లను దీటుగా ఎదుర్కొవాలంటే బ్యాట్స్‌మెన్లు నిరంతరం శ్రమించాల్సి ఉంటుందని సచిన్ అభిప్రాయపడ్డారు.

శ్రీలంక ఫాస్ట్ బౌలర్, పేసర్ లతిష్ మలింగను ఎదుర్కొనే రహస్యం ఏమిటని ప్రశ్నించగా, 'మలింగ జుట్టును చూడొద్దు, అతను విసిరే బంతిపై మాత్రమే దృష్టిపెట్టాల'ని సచిన్‌ నవ్వుతూ అన్నారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+