లండన్: ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ టోర్నమెంట్‌ను గెలవడం తమ అదృష్టమని ఇంగ్లండ్ క్రికెట్ జట్టు కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ అన్నారు. సూపర్ ఓవర్ చిట్టచివరి బంతి వరకు, చివరి నిమిషం వరకు ఈ మ్యాచ్ కొనసాగడం అద్భుతమని చెప్పారు. అల్లా తమ వెంట ఉండటం వల్లే మ్యాచ్‌ను తాము గెలవగలిగామని ఇవాన్ మోర్గాన్ స్పష్టం చేశారు.
వుయ్ హ్యాడ్ అల్లా విత్ అజ్..అని ఆయన వ్యాఖ్యానించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం లండన్ లార్డ్స్ స్టేడియంలోని ప్రెస్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇవాన్ మోర్గాన్ మాట్లాడారు. పలు అంశాలపై ఆయన విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చారు. ఈ మ్యాచ్ అదృష్టం వల్లే గెలిచారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మోర్గాన్ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
Eoin Morgan "We had Allah with us" #CWC19Final pic.twitter.com/Rfb6JdwScI
— Saj Sadiq (@Saj_PakPassion) July 14, 2019
ప్రపంచకప్ గెలుస్తామా? లేదా? అనే అనుమానం నాలో ఉండేది. ఇదే విషయాన్ని నేను స్పిన్నర్ ఆదిల్ రషీద్‌తో చెప్పాను. అల్లా మా వెంటే ఉన్నాడు. తప్పకుండా మ్యాచ్ గెలుస్తాం.. అని రషీద్ నాతో చెప్పాడు. ఆకుపచ్చ (ముస్లింల సంప్రదాయబద్ధ రంగు) వస్త్రాన్ని తాకితే అంతా మంచే జరుగుతుందని అన్నాడు. చివరికి- మ్యాచ్ గెలిచాం. అల్లా మా వెంట ఉన్నందునే విజయం సాధించాం.. అని మోర్గాన్ స్పష్టం చేశారు. ఈ కప్పు ప్రస్తుతం తన పక్కన ఉందంటే- అల్లానే కారణం.. అని చెప్పుకొచ్చారు.
గ్రౌండ్లోకి దిగే ముందు- ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని స్పృశించామని ఆయన తేల్చి చెప్పార. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిందని ఇవాన్ మోర్గాన్ ప్రశంసించారు. ప్రపంచకప్ టోర్నమెంట్ ఆరంభం నుంచీ ఆ జట్టు అద్భుతాలు చేస్తూ వచ్చిందని చెప్పారు. ఒకే రకమైన ఆటతీరును ప్రదర్శించిందని, ఎత్తు పల్లాలను దగ్గరికి రానీవలేదని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆ జట్టు అత్యుత్తమ, నాణ్యమైన క్రికెట్‌ను ఆడిందని చెప్పారు.