For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పేస్, బౌన్సింగ్‌కు అతిగా సహకరిస్తే!: పెర్త్ పిచ్‌పై కోహ్లీ అభిప్రాయమిదీ!

We get more excited than nervous looking at lively pitches: Virat Kohli

హైదరాబాద్: పెర్త్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో భారత్ సత్తా చాటుతుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అడిలైడ్ టెస్టులో తొలిరోజే మ్యాచ్‌పై పట్టు చేజారిపోతున్న తరుణంలో పుజారా సెంచరీతో రాణించడం, ఆ తర్వాత బౌలర్లు సమష్టిగా పోరాడటంతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై ఓ టెస్టు సిరిస్‌లో టీమిండియా నెగ్గడం ఇదే మొదటిసారి.

పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలం

పెర్త్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలం

తొలి టెస్టు విజయ ఉత్సాహాంతోనే కోహ్లీసేన రెండో రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది. పెర్త్‌లో నూతనంగా నిర్మించిన ఆప్టస్‌ స్టేడియం‌లో పిచ్.. పేస్, బౌన్స్‌కి సహకరిస్తుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "సొంతగడ్డపై ఆస్ట్రేలియా బలమైన జట్టు. దీనికి తోడు.. బౌలర్లకి అతిగా అనుకూలించే పెర్త్ వికెట్‌పై ఆడబోతుండటం కచ్చితంగా ఆ జట్టు పుంజుకునే అవకాశం ఉంది. దీనికి తోడు జీవమున్న పిచ్‌లను చూసి ఆందోళన చెందడం లేదు. పైగా ఆత్రుతగా ఉంటున్నాం. ప్రత్యర్థిని కకావికలం చేసే బౌలింగ్‌ దాడి మాకుంది. పెర్త్‌ పిచ్‌పై పచ్చిక తొలగించకున్నా మాకు సంతోషంగానే ఉంది. మేం సానుకూలంగా ఉండి ఒక బ్యాటింగ్‌ విభాగంగా సవాళ్లను స్వీకరించాలి. అడిలైడ్‌లో చేసిందే పునరావృతమయ్యేలా బౌలర్లను ఉత్సాహపరచాలి. అందుకే మేం ఆత్రుతగా ఉన్నాం" అని అన్నాడు.

బౌన్సింగ్ పిచ్ కావడంతో

"పదేళ్లుగా ఇలాంటి పిచ్‌లపై బాగానే ఆడా. నిజాయతీగా చెప్పాలంటే జోహన్స్‌బర్గ్‌ లాంటి వికెట్‌పై మాత్రం ఆడలేదు. 2012లో వాకాలో ఆడా. ఇలాంటి పిచ్‌లు మాకేం కొత్తకాదు. బౌన్సింగ్ పిచ్ కావడంతో టీమిండియాకి కూడా విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. ఆ ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతాం. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు అత్యుత్తమ పేస్‌బౌలింగ్‌ విభాగం ఉన్నందుకు గర్వపడుతున్నా. ఆ ఐదుగురు బౌలర్లు వారంతట వారే అన్నీ చేస్తారు. ఇక్కడ కూర్చొని ఆ ఘనతను నాకు ఆపాదించుకోను. 600, 700 ఇలా ఎన్ని పరుగులు చేసినా 20 వికెట్లు తీయనిదే టెస్టులు గెలవరు. 300 స్కోరే చేసినా 20 వికెట్లు తీస్తే అదే గొప్ప జట్టు. గత మూడు పర్యటనల్లో మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఆసీస్‌లో ఒక్క విజయంతో సంతృప్తి చెందం" అని కోహ్లీ పేర్కొన్నాడు.

13 మందితో జట్టుని ప్రకటించిన బీసీసీఐ

పెర్త్ టెస్టు కోసం గురువారం బీసీసీఐ 13 మందితో కూడిన జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్ రూపంలో ఇద్దరు ఫాస్ట్ బౌలర్లని అదనంగా చేర్చింది. దీనికి తోడు గాయం కారణంగా రెండో టెస్టుకి అశ్విన్, రోహిత్ శర్మ దూరమవడంతో ఇప్పుడు భారత్ జట్టులో ఆందోళన మొదలైంది. వారి స్థానంలో జడేజా, హనుమ విహారి జట్టులోకి ఎంపికయ్యారు.

పెర్త్ టెస్టుకి భారత్ జట్టు:

విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్

Story first published: Thursday, December 13, 2018, 17:21 [IST]
Other articles published on Dec 13, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+