మేం క్షమించాం, ఇక ఐసీసీ ఇష్టం: సర్ఫరాజ్ జాతి వివక్ష వ్యాఖ్యలపై డుప్లెసిస్

హైదరాబాద్: దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై మైదానంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసి పాకిస్థాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మంగళవారం దక్షిణాఫ్రికాతో రెండో వన్డే సందర్భంగా సర్ఫరాజ్ తాను ఓ అంతర్జాతీయ క్రికెటర్ అన్న విషయాన్ని మరిచి చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి.
పెహ్లువికియా బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ల వెనుక ఉర్దూలో అత్యంత జుగుప్సాకరంగా కామెంట్ చేశాడు. ' ఏ నల్లోడా.. మీ అమ్మ ఎక్కడ కూర్చుంది. నీకు ఏం కావాలని ఆమెను ప్రార్థించమన్నావ్?' అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. సర్ఫరాజ్ మాటలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా రికార్డు అయ్యాయి.

సర్ఫరాజ్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు
దీంతో సర్ఫరాజ్ వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అనంతరం సర్ఫరాజ్ తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణ కోరాడు. "మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తా" అని ట్వీట్ చేశాడు.

డుప్లెసిస్ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడుతూ సర్ఫరాజ్‌ను క్షమిస్తున్నామని అన్నాడు. "అతను తన వ్యాఖ్యలపట్ల విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరాడు. దీంతో అతన్ని మేం మన్నిస్తున్నాం. ఇక ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో ఐసీసీ ఇష్టం" అని క్రిన్ ఇన్ఫో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపాడు.
సర్ఫరాజ్ వ్యాఖ్యలపై షోయబ్ అక్తర్ ఇలా
మరోవైపు సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. పాక్ మాజీ పేస్ బౌలర్ అక్తర్ కూడా సర్ఫరాజ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications