సౌతాఫ్రికా: ఈ క్రికెట్ ప్రయాణంలో ఎన్నో మరుపురాని విజయాలి, ఎందరో స్నేహితులు దొరికారని, వీటితో పోలీస్తే నా రికార్డులు ఏ పాటివి అని దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లీయర్స్ అన్నాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
దక్షిణాఫ్రికా తరఫున ఏబీ డివిల్లీయర్స్‌కు ఇది రెండు వందలవ వన్డే. దీనిపై డివిల్లీయర్స్ మాట్లాడుతూ.. దీని గురించి తాను పెద్దగా ఆలోచించడం లేదని అన్నాడు.

200వ వన్డేలు ఆడటం గర్వంగా భావిస్తున్నట్లు చెప్పాడు. సాధారణంగా నేను రికార్డుల గురించి ఎక్కువగా పట్టించుకోనని చెప్పాడు. దేశానికి ఆడటమే గొప్ప అన్నాడు. ఇలాగే క్రికెట్‌ను ఆస్వాదిస్తూ మరిన్ని విజయాలు తన జట్టుకు, దేశానికి అందిస్తానని చెప్పాడు.
ఆస్ట్రేలియాతో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌తో డివిలియర్స్ కెరీర్‌లో ఈ మైలురాయిని అందుకున్నాడు. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఒక ఓవర్ ఆట మాత్రమే సాధ్యమైంది. గత ఏడాది భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా డివిలియర్స్ ఆడిన వందో టెస్టు వర్షం కారణంగా రద్దవడం గమనార్హం.