'గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం.. అదే మా ఓటమికి ప్రధాన కారణం'

గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం. నాథన్ కౌల్టర్‌నైల్ క్యాచ్ విడిచిపెట్టాం. ఆ తర్వాత అతను మరో 30 పరుగులు చేశాడు. అదే మా ఓటమికి ప్రధాన కారణం అని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ తెలిపాడు. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రసవత్తర పోరులో ఆసీస్ 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో జేసన్ హోల్డర్ మాట్లాడాడు. 'మ్యాచ్ ఫలితంపై నిరాశకు గురయ్యాం. కొన్ని బాధ్యతా రహితమైన షాట్లు ఆడి వికెట్లు కోల్పోయాం. అయితే ఈ మ్యాచ్ ద్వారా కొన్ని సానుకూలాంశాలు ఉన్నాయి. కౌల్టర్‌నైల్ 60 పరుగుల వద్ద ఉన్నప్పుడు క్యాచ్ విడిచిపెట్టాం. ఆ తర్వాత మరో 30 పరుగులు చేశాడు. అదే మా ఓటమికి ప్రధాన కారణం' అని హోల్డర్ తెలిపాడు.
'భారీ లక్ష్య ఛేదనలో బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడాలి. కానీ మా బ్యాట్స్‌మెన్ ఆలా ఆడలేదు. ఆరంభంలోనే మ్యాచ్‌పై పట్టు సాధించి ఆస్ట్రేలియాను 280 పరుగులు చేయనిచ్చాం. ఇక్కడే వారు విజయవంతం అయ్యారు. ఇవి టోర్నీ ఆరంభరోజులే. ఇంకా చాలా సమయం ఉంది. నిలకడ ప్రదర్శించాలి. ఇతర జట్లతో జరిగే మ్యాచ్‌లలో విజయాలు సాధిస్తాం' అని హోల్డర్ ధీమా వ్యక్తం చేసాడు.
ప్రపంచకప్‌లో భాగంగా ఆసీసీతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆసీస్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులకే పరిమితమైంది. హోప్(68), హోల్డర్(51), నిఖోలస్(40) రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49 ఓవర్లలో 288 పరుగులకు ఆలౌటైంది. కౌల్టర్ నైల్ (92), స్టీవ్ స్మిత్ (74)లు అర్ధ సెంచరీలు చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications