న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

డెత్‌ ఓవర్లలో విఫలమయ్యాం: ధోనీ

IPL 2019 : MS Dhoni Says Bowling & Misfields Contributed To Loss || Oneindia Telugu
We dont have bowlers who hit the deck says MS Dhoni

బలమైన బౌలింగ్‌ టీమ్‌ లేకపోవడం జట్టు విజయ అవశాలను దెబ్బతీసింది. డెత్‌ ఓవర్లలో ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో మా బౌలర్లు విఫలమయ్యారు అని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నారు. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నైకి షాక్ తగిలింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో చెన్నై జట్టు ఆదిలోనే వికెట్లు కోల్పోయి 37 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న చెన్నై జట్టుకు బ్రేక్‌ పడింది.

బలమైన బౌలింగ్‌ టీమ్‌ లేదు:

బలమైన బౌలింగ్‌ టీమ్‌ లేదు:

మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ధోనీ మాట్లాడుతూ... 'ఆటగాళ్లు అన్ని విభాగాల్లో తప్పులు చేసారు. ఇన్నింగ్స్ బాగానే ఆరంబించాం. 10- 12 ఓవర్ల దాకా ముంబై జట్టును కట్టడి చేశాం. ఆ తర్వాత కొన్ని క్యాచ్‌లు వదిలేయడం, మిస్‌ఫీల్డింగ్‌, బలమైన బౌలింగ్‌ టీమ్‌ లేకపోవడం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. డెత్‌ ఓవర్లలో మా బౌలర్లు ముంబై బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు' అని ధోని తెలిపారు.

ప్రత్యేక ప్రణాళికలు రంచించాలి:

ప్రత్యేక ప్రణాళికలు రంచించాలి:

'జట్టు సభ్యులందరితో ఒకేసారి కాకుండా ఒక్కో ఆటగాడితో సెపరేటుగా మాట్లాడితేనే మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చు, అదే చేసి ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుంటాం. బ్యాట్స్‌మెన్‌ ఎక్కడ పరుగులు చేస్తున్నాడో తెలుసుకొని కట్టడి చేస్తాం. మేము మంచి భాగస్వామ్యాలు నిర్మించాల్సి ఉంది, అందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రంచించాలి' అని ధోనీ చెప్పుకొచ్చారు.

గాయాలు వేధిస్తున్నాయి:

గాయాలు వేధిస్తున్నాయి:

'బ్రావోను గాయం వేధిస్తోంది. మరికొంత మంది ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యారు. స్టార్ పేసర్ డేవిడ్‌ విల్లీ వ్యక్తిగత కారణాల వలన జట్టుకు దూరమయ్యాడు. లుంగీ ఎంగిడి కూడా జట్టుతో కలవలేదు. రానున్న మ్యాచ్‌లలో సరైన కాంబినేషన్లు సెట్‌ చేసి విజయాలు సాధిస్తాం' అని ధోనీ ఆశాభావం వ్యక్తం చేసారు.

Story first published: Thursday, April 4, 2019, 12:05 [IST]
Other articles published on Apr 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X