For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వాళ్లలో ఏ ఒక్కడికీ మేము భయపడం: షమీ

We don't fear Dale Steyn or anyone, says Mohammed Shami

హైదరాబాద్: దాదాపు సంవత్సర కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మొహమ్మద్ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కొన్ని రోజుల ముందు జరిగిన ఢిల్లీ వేదికగా జరిగిన టెస్ట్ సిరీస్‌లో షమీ ఆడాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో సెలక్టర్లని మెప్పించిన షమీ దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. కాగా, వాగ్వాదానికి తెరలేపిన దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌కు మొహ్మద్‌ షమీ దీటైన జవాబిచ్చాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో స్టెయిన్‌కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి భయపడబోమంటూ భారత్ ప్రధాన పేసర్‌ అయిన షమీ స్పష్టం చేశాడు. 'ఎవరి స్వాతంత్ర్యం వారిది. ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. మమ్మల్ని భయపెడతామని ఎవరైనా చెప్పొచ్చు. కానీ, మేము దక్షిణాఫ్రికాకు గట్టి కౌంటర్‌ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. అక్కడ స్టెయిన్‌ పేస్‌కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి భయపడేది లేదు. మా జట్టు వంద శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారించిందని' తెలిపాడు.

ఇంకా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికా పేస్‌కు దీటుగా బదులిచ్చేందుకు మా జట్టులోని సభ్యులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నాడు. కొన్నేళ్లనుంచి తాము ఏ జట్టుకు భయపడటం లేదనే విషయాన్ని గుర్తు చేసుకోమన్నాడు. త్వరలో దక్షిణాఫ్రికా దైపాక్షిక సిరీస్‌లో కూడా అదే రిపీట్‌ చేయనున్నామంటూ బదులిచ్చాడు.

ప్రణాళికలను మీడియా ముందు ఉంచడానికి తాము సిద్ధంగా లేమంటూ జట్టుపై నమ్మకాన్ని వెలిబుచ్చాడు. కాకపోతే ఒకే ఒక్క విషయం చెప్పగలను అంటూ.. దక్షిణాఫ్రికా పిచ్‌లపై షార్ట్‌ బంతుల్ని సంధించడానికి దూరంగా ఉంటామన్నాడు. దక్షిణాఫ్రికా జట్టులో స్వ్కేర్‌ కట్‌, ఫుల్ షార్ట్‌, హుక్‌ షాట్‌లను అవలీలగా ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి విభిన‍్నమైన ప్రణాళికలతో సఫారీ పర్యటన ఉండబోతుంది' అని షమీ పేర్కొన్నాడు.

అంతకుముందు స్టెయిన్‌ మాట్లాడుతూ.. ఇక్కడి పిచ్‌లపై 150 కి.మీ వేగంతో బంతులు సంధించి టీమిండియాను భయపెట్టడానికి సిద్దంగా ఉన్నామన్నాడు. కచ్చితమైన లెంగ్త్‌తో పాటు బౌన్సర్లతో విరాట్‌ సేనను హడలెత్తిస్తాం' అని స్టెయిన్‌ ముందుగా మాటల యుద్ధానికి తెరలేపాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 28, 2017, 14:00 [IST]
Other articles published on Dec 28, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+