For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌గా తొలగించాలనుకుంటే ధోనీనే షాకిచ్చాడు!

న్యూఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్షన్ కమిటీ షాకిస్తామనుకుంటే, అంతలోనే అతనే వారికి షాకిచ్చాడా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్. ధోనీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే చర్చ తన పదవీ కాలంలో చాలాసార్లు జరిగిందని సందీప్ చెప్పాడు.

గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ వంటి సీనియర్ ఆటగాళ్లను ధోనీ సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోయాడన్నాడు. అదే సమయంలో యువరాజ్‌, గంభీర్‌లతో ధోని సంబంధాల గురించి చెడుగా రాయడం చూసి చాలా నిరాశకు గురయ్యానని, వాళ్లిద్దరి ఎంపికను ధోని ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నాడు.

అయితే ధోనీ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పడంతో తాము షాకయ్యామన్నాడు. ధోనీ స్థానంలో మరో వ్యక్తికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావించామని, కానీ 2015 వన్డే ప్రపంచ కప్‌కు ముందు అది సరికాదని తగ్గామని, ప్రపంచ కప్‌కు ముందు ధోనీనే టెస్టుల నుంచి వైదొలగడంతో ఆ బాధ్యతలను కోహ్లీకి అప్పగించామని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లోను జట్టును కోహ్లీ నడిపించగలడన్నాడు.

We did discuss about removing Dhoni from captaincy: Patil

ఆల్ టైమ్ టెస్ట్ టీంకు కెప్టెన్‌గా ధోనీ

ప్రఖ్యాత క్రికెట్‌ మ్యాగజైన్‌ విజ్డెన్‌.. భారత జట్టు ఆల్‌టైం టెస్ట్‌ లెవెన్‌కు కెప్టెన్‌గా ధోనీని ఎంపిక చేసింది. న్యూజిలాండ్‌తో గురువారం ఆరంభం కానున్న భారత 500వ టెస్ట్‌ నేపథ్యంలో విజ్డెన్‌ ఆల్‌ టైం టెస్ట్‌ లెవన్‌ను ప్రకటించింది.

ఓపెనర్లుగా సునీల్‌ గవాస్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేసింది. రాహుల్‌ ద్రావిడ్‌, సచిన్‌ టెండూల్కర్, లక్ష్మణ్‌, ఆల్ రౌండర్ కపిల్‌ దేవ్‌, వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా ధోనీని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో తర్వాతి స్థానాల్లో చేర్చారు. బౌలింగ్‌ విభాగంలో కుంబ్లే, శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌, బిషన్‌ సింగ్‌ బేడీలకు చోటు దక్కింది. అజరుద్దీన్‌ 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.

విజ్డెన్‌ టెస్ట్‌ లెవెన్‌: గవాస్కర్‌, సెహ్వాగ్‌, ద్రావిడ్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, కపిల్‌ దేవ్‌, ధోనీ (కెప్టెన్‌/వికెట్‌ కీపర్‌), అనిల్‌ కుంబ్లే, శ్రీనాథ్‌, జహీర్‌ ఖాన్‌, బిషన్‌ సింగ్‌ బేడీ, అజరుద్దీన్‌ (12వ ఆటగాడు).

మహేంద్ర సింగ్ ధోనీకి సెలక్షన్ కమిటీ షాకిస్తామనుకుంటే, అంతలోనే అతనే వారికి షాకిచ్చాడా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్. ధోనీని సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనే చర్చ తన పదవీ కాలంలో చాలాసార్లు జరిగిందని సందీప్ చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+