ఫోటోలు: ఆటగాడి విఫలంపై కోహ్లీ కొత్త నిర్వచనం
హైదరాబాద్: వ్యక్తిగత ప్రదర్శనపై తనకు పెద్దగా పట్టింపు లేదని, జట్టుగా విజయం సాధిస్తే అదే చాలని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ఓపెనర్ మురళీ విజయ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ రహానే విఫమవుతున్నారంటూ వస్తున్న విమర్శలపై కోహ్లీ మండిపడ్డాడు.
సిరిస్ జరుగుతున్న సమయంలో జట్టులోని ఎవరైనా ఆటగాడు విఫలమైతే మరో వ్యక్తి దానిని భర్తీ చేస్తాడంటూ కొత్త నిర్వచనం చెప్పాడు. 'మురళీ విజయ్ లేదా రహానే ఎవరైనా సరిగా ఆడలేకపోతే ఆ స్థానాన్ని మరో ఆటగాడు భర్తీ చేస్తాడు' అంటూ కోహ్లీ తన సహచర ఆటగాళ్లకు అండగా నిలిచాడు.

విజయ్, రహానే ప్రదర్శనపై కోహ్లీ
ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న సిరిస్‌లో విజయ్(192 పరుగులు ఆరు ఇన్నింగ్స్‌ల్లో), రహానె (63 పరుగులు 5 ఇన్నింగ్స్‌ల్లో)లు తమ స్థాయికి తగినట్లు ప్రదర్శన ఇవ్వలేకపోయారంటూ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గురువారం నుంచి ముంబైలోని వాంఖడె మైదానంలో నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ బుధవారం మీడియాతో మాట్లాడాడు.

రహానే, విజయ్ ఇద్దరూ చక్కటి ఆటగాళ్లు
‘రహానే, విజయ్ ఇద్దరూ చక్కటి ఆటగాళ్లు. రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విజయ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో నేను కూడా స్థాయికి తగిన విధంగా ప్రదర్శన ఇవ్వలేకపోయాను. ఆ సమయంలో రహానే చక్కగా రాణించాడు. ఇలా పరుగులు సాధించడంలో ఒకరు విఫలమైతే మరొకరు రాణించాలి, అదే కదా టీమ్ స్పోర్ట్ అంటే' అని కోహ్లి అన్నాడు.

వ్యక్తిగత ప్రదర్శన నాకు ముఖ్యం కాదు
‘ఈ ఆటగాడు బాగా ఆడాడు. ఇతను అద్భుతంగా ఆడాడు. అంటూ వ్యక్తిగత ప్రదర్శనలకు ఇక్కడ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. పరుగుల వేటలో ఒకరు విఫలమైతే ఆ నష్టాన్ని ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లు భర్తీ చేస్తారు. ఇదే జట్టు మా లక్ష్యం' అని కోహ్లి తెలిపాడు.

లోయర్ ఆర్డర్‌పై సంతృప్తి
లోయర్ ఆర్డర్‌లో ఆటగాళ్లు రాణించడంపై కోహ్లీ సంతృప్తి వ్కక్తం చేశాడు. మొహాలి టెస్టులో అరంగేట్రం చేసిన కొత్త ఆటగాడు జయంత్ యాదవ్‌పై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. కేవలం రెండు మ్యాచ్‌లతోనే జయంత్ యాదవ్ నన్ను ఆకట్టుకున్నాడని కోహ్లీ వెల్లడించాడు.

జయంత్ యాదవ్‌కు కోహ్లీ ప్రశంసలు
జయంత్ యాదవ్‌ని ఇకపై ఆల్‌రౌండర్ అని అనవచ్చని అన్నాడు. ఇంతకు మించి అతని గురించి చెప్పాల్సిందేమీ లేదు. మ్యాచ్‌లో ఎక్కడ బౌలింగ్ వేయాలో అతనికి బాగా తెలుసుని చెప్పిన కోహ్లీ, ఆటను అర్ధం చేసుకోగలిగిన సత్తా అతడికి ఉందని కితాబిచ్చాడు.

మంచి టెస్టు క్రికెటర్
'స్కిల్స్‌ను బాగా ప్రదర్శిస్తున్నాడు. గేమ్‌ను బాగా అర్ధం చేసుకుంటాడు. తెలివైన వ్యక్తి. రాబోయే రోజుల్లో అతడు జట్టుకు మ్యాచ్‌ని గెలిపించే ప్రదర్శనలిస్తాడు. మంచి టెస్టు క్రికెటర్' అని కోహ్లీ అన్నాడు. ఇక
మురళీ విజయ్, రాహుల్‌లు అద్భుతమైన ఓపెనర్లుగా అభివర్ణించాడు.

గురువారం నుంచి ముంబైలో నాలుగో టెస్టు
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ముంబైలోని వాంఖడె స్టేడియంలో నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. రాజ్ కోట్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగియగా, ఆ తర్వాత విశాఖపట్నం, మొహాలిలో జరిగిన రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై టీమిండియా విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications