Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిమానం ముదిరింది.. హిజ్రాలతో కలిసిపోయిన గౌతం గంభీర్

 We can’t grow without involving everyone, says Gautam Gambhir at Hijra Habba

హైదరాబాద్: హిజ్రాల కోసం ఇప్పటికే పలువురు తమ గళాన్ని వినిపించి వారిని సమాజంలో ఒకరిగా చూడాలంటూ పిలుపునిచ్చారు. వారి కోసం ఎంతో కొంత చేశారు. కానీ, గౌతం గంభీర్ 'అంతకుమించి' అన్నట్లు వారితోనే కలిసిపోయాడు. ఎలాగంటే వారి వేషధారణలో కనిపించాడు. వారిని భారతీయులుగా గుర్తించాలంటూ ప్రసంగించాడు. సామాజిక సేవ విషయంలో టీమిండియా ఆటగాడు గౌతం గంభీర్ ముందే ఉంటాడు.

అనుకున్నది భయపెట్టే స్వభావం కలవాడు

తన వంతు సాయం చేసి మిగిలిన వారికి భిన్నంగా అనిపించినా తాను అనుకున్నది భయపెట్టే స్వభావం కలవాడు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు అతను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాడు. అంతేకాక.. సమాజంలో జరుగుతున్న కొన్ని అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఘటనల గురించి సోషల్‌మీడియా వేదికగా చురుకుగా స్పందిస్తూనే ఉన్నాడు.

హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని

కొద్ది రోజులుగా సమాజంలో అక్కడక్కడా వివక్షను అనుభవిస్తున్న హిజ్రాలపై పడింది. వారిని సమాజంలో మనుషులుగా గుర్తించాలంటూ ముందుకొచ్చాడు. ఇలా సమాజంలో హిజ్రాలపై ఉన్న చిన్న చూపుని చెరిపేసేందుకు గంభీర్ తాజాగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇందుకు నాందిగా ఈ ఏడాది రక్ష బంధన్ రోజున అతను హిజ్రాలతో రాఖీలు కట్టించుకొని ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశాడు. తాజాగా గంభీర్ మ‌ద్దతు ప‌లుకుతూ హిజ్రా వేషాన్ని ధ‌రించాడు.

బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు

ఢిల్లీలో హిజ్రాల‌కు సంబంధించిన ఓ కార్యక్రమంలో అత‌ను బొట్టు పెట్టుకుని హిజ్రాలు వేసుకునే దుస్తులు ధ‌రించాడు. ఇందుకు సంబంధించిన‌ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. తన స్థాయిని పక్కన పెట్టి హిజ్రాల కోసం ఇలాంటి పని చేసిన గంభీర్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలంటూ.. సోషల్‌మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు.

వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి

ఈ కార్యక్రమంలో పాల్గొన్న గంభీర్ మాట్లాడుతూ.. ఐపీసీ 377 సెక్షన్ రద్దు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఈ తీర్పు పట్ల నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి కారణమైన ఆ కమ్యూనిటీకి నా ప్రోత్సాహం ఎల్లప్పుడూ అందజేస్తాను. ఎందుకంటే వాళ్లూ మనలాంటి మనుషులు. ఒకరితో ఒకరం కలవకుండా ముందుకు వెళ్లడమంటే అది ఎప్పటికీ కుదరని పని. వాళ్లు కూడా భారతీయులే కాబట్టి మనం వారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి.' అని ప్రసంగించాడు.

Story first published: Friday, September 14, 2018, 16:59 [IST]
Other articles published on Sep 14, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+