Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'టీమిండియాను ఓడించి ప్రపంచకప్‌ను ఘనంగా ముగిస్తాం'

'We Can Beat India And End World Cup On A high' Says Dhananjaya De Silva || Oneindia Telugu
We can beat India and end World Cup on a high: Sri Lanka spinner Dhananjaya de Silva

హైదరాబాద్: టీమిండియాను ఓడించి... ఈ ప్రపంచకప్‌ను ఘనంగా ముగిస్తామని శ్రీలంక స్పిన్నర్ ధనుంజయ డిసిల్వా చెప్పుకొచ్చాడు. టోర్నీలో భాగంగా లీగ్ స్టేజిలో టీమిండియా తన ఆఖరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడనుంది. జులై 6న జరిగే ఈ మ్యాచ్‌కి లీడ్స్ వేదిక కానుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగిస్తామని శ్రీలంక స్పిన్ బౌలర్ ధనుంజయ డిసిల్వా ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇప్పటివరకు మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి... మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

మరో రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. 8 పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతున్న శ్రీలంక ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇంగ్లాండ్, వెస్టిండిస్‌లతో జరిగిన మ్యాచ్‌ల్లో విజయం సాధించిన శ్రీలంక అదే జోరుతో టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది.

ఈ నేపథ్యంలో ధనుంజయ డిసిల్వా మాట్లాడుతూ "ఐసీసీ టోర్నీల్లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో భారత్‌కు మేం గట్టి పోటీ ఇచ్చాం. వెస్టిండీస్‌తో విజయంతో మంచి జోష్‌లో ఉన్నాం. ఆదే జోష్‌ని తర్వాతి మ్యాచ్‌లోనూ కొసాగించి.. టోర్నీని ఐదో స్థానంలో ముగించాలని అనుకుంటున్నాం" అని అన్నాడు.

ఇక, టీమిండియా విషయానికి వస్తే బర్మింగ్ హామ్ వేదికగా మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 28 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్దేశించిన 315 పరుగుల లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ 286 పరుగులకే కుప్పకూలింది.

Story first published: Wednesday, July 3, 2019, 18:28 [IST]
Other articles published on Jul 3, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+