Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమ్‌ని ఎన్నిసార్లు ఆదుకున్నా చోటుపై నమ్మకం లేదు

VVS Laxman
సోమర్‌సెట్‌: 2001లో ఆస్ట్రేలియాపై కోల్‌కత ఈడెన్‌ గార్డెన్స్‌లో చరిత్రాత్మక ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత హైదరాబాదీ సొగసరి బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ గురించి అభిమానుల్లో పాతుకుపోయిన నిశ్చితాభిప్రాయం. కానీ అలాంటి ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ సంశయాలకు తావులేకుండా తుది జట్టులోకి ఎంపికవుతానన్న నమ్మకం తనకు ఉండేది కాదని అంటున్నాడు... వీవీఎస్‌. జట్టులో స్థానం సుస్థిరమన్న భావన గత నాలుగేళ్ల నుంచే తనలో కలిగిందని చెబుతున్నాడు. ''గత నాలుగేళ్లలో అనిల్‌ (కుంబ్లే) భాయ్‌, తర్వాత ధోనీ, అలాగే కిర్‌స్టన్‌ జట్టులో చోటు ఖాయమన్న భరోసా నాకిచ్చారు. నేను నా సహజసిద్ధమైన ఆటను ఆడేలా ప్రోత్సహించారు. ఆ స్వేచ్ఛతో మెరుగైన ప్రదర్శనలిచ్చాను'' అని లక్ష్మణ్‌ వివరించాడు.

''తొలి నాలుగేళ్లలో అంటే 1996-2000 మధ్య ఇన్నింగ్స్‌ను ఆరంభించేటప్పుడు జట్టుకు అత్యుత్తమ సేవలందించేందుకు ప్రయత్నించాను. ఓ రెండు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కాగానే నేను రెగ్యులర్‌ ఓపెనర్‌ను కాదన్న ముద్ర వేసేవాళ్లు. తరుచుగా జట్టు నుంచి తప్పించేవాళ్లు'' అంటూ వీవీఎస్‌ గతాన్ని నెమరువేసుకున్నాడు. లక్ష్మణ్‌ తన కెరీర్‌ను రెండు దశలుగా విభజించాడు. 2007 తర్వాత రెండో దశలో జట్టులో స్థానం ఖాయమన్న భరోసా లభించిందని చెప్పాడు. కరీబియన్‌లో ప్రపంచకప్‌ తర్వాత... అంటే 2007 జులై నుంచి లక్ష్మణ్‌ 43 టెస్టులాడి 57.33 సగటుతో 3268 పరుగులు సాధించాడు. అంతకుముందు 80 టెస్టుల్లో 42.42 సగటుతో 4878 పరుగులు చేశాడు.

1996-2000 మధ్య కాలంలో అయితే 16 మ్యాచ్‌లాడి 24.07 సగటుతో కేవలం 626 పరుగులు మాత్రమే చేశాడు. 2004-2007 మధ్య 31 టెస్టులాడినప్పటికీ 37.11 సగటుతో 1596 పరుగులు మాత్రమే సాధించగలిగాడు. ఐదుగురు బౌలర్లతో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడల్లా తననే పక్కన పెట్టడం లక్ష్మణ్‌ను బాధించేది. ''తొలి నాలుగేళ్లు నాకు చాలా కష్టంగా గడిచింది. నాకు సాధ్యమైన వాటిపైనే దృష్టి పెట్టాలని అప్పుడు గుర్తెరిగాను. బాగా శ్రమించాను'' అని లక్ష్మణ్‌ చెప్పాడు. ''ప్రతి ఇన్నింగ్స్‌ను ఆశావహ దృక్పథంతో ఆడతాను. ఈ ఆలోచనా సరళి వల్లే గత నాలుగేళ్లుగా ఆనందంగా ఉండగలుగుతున్నాను'' అని అన్నాడు.

నెంబర్‌ వన్‌ జట్టయిన టీమ్‌ ఇండియా ఎవరి మీదైనా గెలవగలదని లక్ష్మణ్‌ ధీమా వ్యక్తంచేశాడు. రానున్న నాలుగు టెస్టుల సిరీస్‌ హోరాహోరీగా సాగడం ఖాయమన్నాడు. ఇంగ్లాండ్‌ మెరుగైన జట్టని... యాషెస్‌ సిరీస్‌లో ఆసీస్‌ను ఆస్ట్రేలియాలో ఓడించిందని గుర్తు చేశాడు.

క్రికెట్‌ మక్కా లార్డ్స్‌లో సెంచరీ చేయాలనుందంటూ వీవీఎస్‌ లక్ష్మణ్‌ తన కోరికను వెల్లడించాడు. తాను జట్టులో ఉండగా లార్డ్స్‌లో భారత్‌ ఇంతవరకు గెలవలేదని... టీమ్‌ఇండియా గెలుపులో తన తొలి సెంచరీ దోహదపడాలని అన్నాడు. ''ఇంగ్లాండ్‌లో నేను సెంచరీ చేయలేదు. నేనుండగా జట్టు లార్డ్స్‌లో గెలవలేదు'' అని చెప్పాడు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+