For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరతాం

We Believe We Have A Chance Of Making The World Cup Semifinals: Mohammad Shahzad

హెరాత్‌: వచ్చే ఏడాది జరగబోయే వన్డే వరల్డ్‌కప్‌లో తమ సత్తా చాటుతామని తద్వారా సెమీ ఫైనల్‌‌కు చేరుకోగలమనే ధీమాని వ్యక్తం చేస్తున్నాడు మొహమ్మద్ షెహ్‌జాద్. అఫ్ఘానిస్తాన్ వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌ మొహమ్మద్‌ షెహజాద్‌ ధీమా వ్యక్తం చేశాడు. తమదైన రోజున ఎంతటి జట్టునైనా ఓడిస్తామన్న షెహజాద్‌.. తమ జట్టు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగానే ఉందనే విషయాన్ని గుర్తు చేశాడు.

సెమీ ఫైనల్‌ చేరతామనే నమ్మకముంది

సెమీ ఫైనల్‌ చేరతామనే నమ్మకముంది

‘అఫ్ఘాన్ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో బలంగా ఉంది. దవ్లాత్‌ జద్రాన్‌, అప్తాబ్‌ అలామ్‌లు మా పేస్‌ బౌలింగ్‌ బలం. బ్యాటింగ్‌లో సముచిత స్కోరు ఆటగాళ్లున్నారు. ఇక మా స్పిన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక‍్కర్లేదు.. అది అందరికీ తెలిసిన విషయమే. దాంతో వచ్చే మెగా టోర్నీలో సెమీ ఫైనల్‌ చేరతామనే నమ్మకం నాకుంది. నా వరకూ అయితే సహజసిద్ధమైన ఆటనే ఆడతా. ప్రధానంగా బంతి లెంగ్త్‌ను చూసే బ్యాటింగ్‌ చేస్తా. నా జోన్‌లో ఉన్న బంతిని ఎటువంటి కనికరం లేకుండా హిట్‌ చేయడమే నాకు తెలుసు. క్రికెట్‌లో ఎక్కువ అవకాశాలనేవి ఉండవు. మనకు వచ్చిన అవకాశాల్ని ఒడిసి పట్టుకోవడమే మనం చేయాల్సింది. దాన్ని ఎంజాయ్‌ చేస్తూ నా ఆటను కొనసాగిస్తున్నా'

క్రమంగా ఎదుగుతోన్న అఫ్ఘాన్ జట్టు

క్రమంగా ఎదుగుతోన్న అఫ్ఘాన్ జట్టు

అఫ్ఘాన్ జట్టు రెండు దశాబ్దాల క్రితం ఆటను గుర్తుకు తెచ్చి ఆ జట్టుకు పునర్వైభవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ క్రమంలో అఫ్ఘాన్ జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రస్తుత క్రికెట్‌లో మంచి దూకుడు మీదున్న జట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2008వ సంవత్సరంలో వరల్డ్ కప్ క్రికెట్ లీగ్‌లో అర్హత సాధించేందుకు మ్యాచ్‌లు ఆడింది అఫ్ఘనిస్తాన్. మూడేళ్ల తర్వాత ఆ దేశ జట్టుకు వన్డే అర్హతను తెచ్చుకుంది. ఆ ఘనత అనంతరం 2015లో 50ఓవర్ల వరల్డ్ కప్‌కు అర్హత తెచ్చిపెట్టింది. ఇక 2017లో ఆ జట్టు టెస్టు ఫార్మాట్ హోదా దక్కించుకుంది.

 భారత్‌ను దాదాపు ఓటమి అంచుల వరకూ

భారత్‌ను దాదాపు ఓటమి అంచుల వరకూ

ఈ ఏడాది జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ ఫైనల్ మ్యాచ్‌లో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్ జట్టును ఓడించింది. దీంతో వచ్చే ఏడాది ప్రపంచ కప్ పోటీలో నిలిచేందుకు అర్హత సాధించింది. భారత్‌లో తమ తొలి టెస్టును ఆడటమే కాకుండా టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ జట్టును వైట్ వాష్ చేసింది. ఇక ఆసియా కప్ విషయానికొచ్చేసరికి శ్రీలంకను ఓడించి భారత్‌ను దాదాపు ఓటమి అంచుల వరకూ తీసుకెళ్లింది.

16బంతుల్లో 74 పరుగులు చేసి

16బంతుల్లో 74 పరుగులు చేసి

దుబాయ్ వేదికగా జరుగుతోన్న టీ10 లీగ్‌లో అఫ్గాన్ క్రికెటర్ మొహమ్మద్ షెహ్‌జాద్ రెచ్చిపోయాడు. కేవలం 16బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు చక్కటి స్కోరును అందించాడు. దీంతో తాను ప్రాతినిధ్యం వహించిన రాజ్‌పుత్స్ జట్టు పది వికెట్ల ఆధిక్యంతో గెలుపొందింది. 95 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఓపెనర్ షెహ్‌జాద్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు.

Story first published: Tuesday, December 4, 2018, 15:48 [IST]
Other articles published on Dec 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+