For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రాత్‌వైట్‌కు 18వ ఓవర్ ఇవ్వడంపై: 'నా నిర్ణయం సరైందే'

By Nageshwara Rao
We backed Carlos with his death bowling - Williamson

హైదరాబాద్: వాంఖడె వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించిన ఐపీఎల్ 11వ సీజన్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌ ఓటమికి ఆ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ నిర్ణయమే కారణమని సోషల్‌ మీడియాలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

సన్‌రైజర్స్ బౌలింగ్‌లో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్‌, సిద్దార్థ్‌ కౌల్‌, సందీప్‌ శర్మలను కాదని 18వ ఓవర్ వేసేందుకు గాను బ్రాత్‌వైట్‌ను కేన్ విలియమ్సన్ ఆహ్వానించాడు. దీంతో బ్రాత్‌వైట్ వేసిన 18వ ఓవర్‌లో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఓవర్‌లో డుప్లెసిస్‌ మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 20 పరుగులు రాబట్టాడు.

 బ్రాత్‌వైట్‌తో బౌలింగ్: సరైన నిర్ణయమే

బ్రాత్‌వైట్‌తో బౌలింగ్: సరైన నిర్ణయమే

దీంతో మ్యాచ్ హైదరాబాద్ చేజారిపోయంది. అయితే, డెత్ ఓవర్లలో బ్రాత్‌వైట్‌తో బౌలింగ్ చేయించడం సరైన నిర్ణయమేనని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ సమర్థించుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని, బ్రాత్‌వైట్ వైపు మొగ్గడానికి అనేక కారణాలున్నాయని విలియమ్సన్ అన్నాడు.

ఒత్తిడిలో కొన్నిసార్లు ప్రణాళికలు విఫలమవుతుంటాయి

ఒత్తిడిలో కొన్నిసార్లు ప్రణాళికలు విఫలమవుతుంటాయి

'డెత్ ఓవర్లలో బౌలింగ్ కోసమే అతన్ని జట్టులోకి తీసుకున్నాం. ఒత్తిడిలో కొన్నిసార్లు ప్రణాళికలు విఫలమవుతుంటాయి. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా మెరుగైన అవకాశాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కాబట్టే బ్రాత్‌వైట్‌కు బౌలింగ్ ఇచ్చాం. మా బౌలర్లందరూ సమర్థంగా రాణించారు. తక్కువ స్కోరు గేమ్‌లో కొన్ని బంతులు అటు ఇటు అవుతుంటాయి' అని అన్నాడు.

హైదరాబాద్ ప్రదర్శనపై పూర్తి సంతృప్తితో ఉన్నాం

హైదరాబాద్ ప్రదర్శనపై పూర్తి సంతృప్తితో ఉన్నాం

'కొన్నిసార్లు మ్యాచ్‌లు అటు ఇటు అవుతుంటాయి. దాంతోనే స్కోరుబోర్డు ముందుకెళ్లింది. మా ప్రదర్శనపై పూర్తి సంతృప్తితో ఉన్నాం. తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తాం' అని విలియమ్సన్ పేర్కొన్నాడు. వాంఖడె వేదికగా హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో చెన్నై విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు అవసరమయ్యాయి.

బ్రాత్‌వైట్‌కు బంతి ఇవ్వడంపై విమర్శలు

బ్రాత్‌వైట్‌కు బంతి ఇవ్వడంపై విమర్శలు

ఈ దశలో విలియమ్సన్ బ్రాత్‌వైట్‌తో బౌలింగ్ చేయించాడు. బ్రాత్‌వైట్ వేసిన 18వ ఓవర్‌లో డుప్లెసిస్ ఏకంగా 20 పరుగులు రాబట్టడంతో చెన్నై విజయం సాధించి పైనల్స్‌కు చేరింది. అయితే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్, సిద్ధార్ద్ కౌల్, సందీప్ శర్మ అందుబాటులో ఉన్నా.. బ్రాత్‌వైట్‌కు బంతి ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Story first published: Thursday, May 24, 2018, 13:21 [IST]
Other articles published on May 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+