For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఎక్కడికైనా వెళ్లగలం: భువీ

We Are Ready To Go To England and Australia: Bhuvneshwar Kumar

హైదరాబాద్: సఫారీ పర్యటనలో భారత క్రికెటర్లు విజృంభించి ఆతిథ్య జట్టును 2-1 విజయంతో పర్యటనను ముగించుకున్నారు. కాగా, భారత జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన భారత బౌలర్లపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. దీనిపై శనివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ ఇలా స్పందించారు.

జరిగిన మూడు సిరీస్‌లతో తమకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఏ దేశంతో అయినా ఆడి గెలవగలమనే నమ్మకం వచ్చిందన్నాడు. ఆఖరి టీ20లో సైతం స్వల్ప తేడాతో ఏడు పరుగులతో గెలవడం ఉత్కంఠకు గురి చేసిందన్నాడు. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గెలవడం మాలో ఆత్మ విశ్వాసం పెంచిదని పేర్కొన్నాడు. ఆతిథ్య జట్టుపై 5-1 తేడాతో సిరీస్ ను గెలుచుకోవడం సాధారణ విషయం కాదని అభిప్రాయపడ్డాడు.

ఆఖరి టీ20 లో కేవలం ఏడు పరుగులతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆ ఘనతను అందరికీ ఆపాదించాడు. ఆయన మాట్లాడుతూ.. జట్టులోని బౌలర్లందరికీ ఆ ఘనత వర్తిస్తుంది. టీ20ల్లో కేవలం నాలుగు ఓవర్లే వస్తాయి. అవే కీలకంగా మారతాయి. ఒక ఓవర్‌లో వరుసగా మూడు బంతులు ప్రతికూలిస్తే మ్యాచ్ తిరిగిపోతుంది.సరిగ్గా ఆఖరి టీ20లోనూ అలాగే జరిగింది' అని పేర్కొన్నాడు.

'మ్యాచ్‌లలో పవర్ ప్లేలు అదే స్థాయిలో మ్యాచ్‌ను మారుస్తాయి. నాలుగైదు వికెట్లు కోల్పోయిన జట్టుకైనా పవర్ ప్లే వచ్చిందంటే పండగే. ఈ పొట్టి క్రికెట్ సిరీస్‌లో అంత త్వరగా గెలుపును అంచనా వేయలేం. ఈ పరిస్థితుల్లో బౌలర్ నాయకుడిగా వ్యవహరించాలి. నాయకుడు ఎలా అయితే నిర్ణయం తీసుకోగలడే అదే విధంగా ఆలోచించాలి' అని పేర్కొన్నాడు.

పర్యటనలో జట్టు ప్రదర్శనను విశ్లేషించి ఇప్పుడు గెలిచామని మళ్లీ పర్యటనకు ఇదే ఫలితాన్ని ఆశించలేమని భువీ పేర్కొన్నాడు. ఈ సారి పర్యటనలో అంతా కొత్తగా మొదలుపెట్టాల్సిందే అని అభిప్రాయపడ్డాడు. ఈ పర్యటన మాత్రం తెలివిగా ప్రవర్తించి గట్టెక్కగలిగామని తెలిపాడు. మాతో పాటుగా దక్షిణాఫ్రికా బౌలర్లు జానియర్ డాలా లాంటి వాళ్లు అసాధారణ ప్రతిభ చూపించారని కొనియాడాడు.

Story first published: Monday, February 26, 2018, 14:55 [IST]
Other articles published on Feb 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+