'పోటీ ఇచ్చేందుకు మాత్రమే కాదు.. గెలవాలని వచ్చాం'

హైదరాబాద్: భారత్ గడ్డపై టెస్టు సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన వెస్టిండీస్.. వన్డే సిరీస్‌లో అదరగొడుతోంది. తొలి వన్డేలో ఓటమి తర్వాత.. భారీ లక్ష్య చేధనలో రెండో వన్డేను టైగా ముగించిన విండీస్.. మూడో వన్డేలో 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్ 1-1తో సమం చేసి.. ఐదు వన్డేల సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చింది. షాయ్ హోప్ 95 పరుగులు చేయడం, మార్లోన్ శామ్యూల్స్ మూడు కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ విండీస్ వైపు మొగ్గింది.

బెరుకు లేకుండా ఆడతాడని హెట్‌మయెర్‌ను
రెండో వన్డేలో అజేయ సెంచరీ సాధించిన హోప్.. మూడో వన్డేలో ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టును గెలిపించాడు. హోప్ ఆటతీరుపై సీనియర్ ఆటగాడు శామ్యూల్స్ ప్రశంసలు గుప్పించాడు. డ్రెస్సింగ్ రూంలో కూర్చొని అతడి బ్యాటింగ్ చూస్తుంటే అద్భుతంగా ఉందని తెలిపాడు. హోప్ మా జట్టుకు ఆశాకిరణం అవుతాడని చెప్పాడు. ఏ మాత్రం బెరుకు లేకుండా, ధైర్యంగా ఆడతాడని హెట్‌మయెర్‌ను శామ్యూల్స్ కొనియాడాడు.

మూడో బంతికే కోహ్లిని పెవిలియన్
భారత్ చేధనలో ఉండగా.. 42వ ఓవర్లో బౌలింగ్‌కు దిగిన శామ్యూల్స్.. మూడో బంతికే కోహ్లిని పెవిలియన్ చేర్చాడు. మోకాలి గాయం కారణంగా ఇటీవలి కాలంలో నెట్స్‌లోనూ బౌలింగ్ ప్రాక్టీస్ చేయని అతడు.. కీలక తరుణంలో బౌలింగ్ చేసి జట్టు విజయానికి తన వంతు సహకారం అందించాడు.

మరింత సీరియస్‌గా తీసుకుంటాం
'మేమంతా సమష్టిగా ఆడుతున్నామని చెప్పిన శామ్యూల్స్.. తర్వాతి రెండు మ్యాచ్‌లను కోల్పోవడానికి ఇష్టపడటం లేదన్నాడు. మిగతా మ్యాచ్‌లను గెలవాలని చూస్తున్నాం. మేం పోటీ మాత్రమే ఇవ్వాలని అనుకోవడం లేదు. గెలవాలని చూస్తున్నాం. తదుపరి మ్యాచ్‌ను మేం మరింత సీరియస్‌గా తీసుకుంటాం' అని శామ్యూల్స్ తెలిపాడు.

వాళ్లు పూర్తిగా అర్హులు
మరోవైపు విండీస్ ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. తమకంటూ అవకాశం వస్తే విండీస్ ఎలాంటి జట్టునైనా ఓడించగలదు. ఈ మ్యాచ్‌లో వాళ్లు అద్భుతమైన ప్రదర్శన చూపించారు. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు అని కోహ్లీ అన్నాడు. జట్టులో సరైన ఆల్‌రౌండర్ లేకపోవడం కూడా లోటేనని ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications