అడుక్కోవడం లేదు: పీసీబీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్య
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడమని తామేమీ భారత్‌ను అడుక్కోవడం లేదని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ సంచలన వ్యాఖ్య చేశారు. ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని గౌరవించాలని మాత్రమే కోరుతున్నామని ఆయన అన్నారు. ఇరుదేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లపై దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఐసీసీ కౌన్సిల్ సమావేశంలో షహర్యార్ ఖాన్ స్పందించారు.
పాకిస్తాన్‌తో సిరిస్‌లు ఆడేందుకు భారత్ నిరాకరించడం వల్ల పీసీబీ పెద్ద మొత్తంలో నష్టపోతుందని, ఆర్థికంగా ఎన్నో సమస్యలు తలెత్తుతాయని ఆయన వెల్లడించారు. 2015-2023 మధ్య కాలంలో ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని గతంలో ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయని, దీనిపై భారత్‌కు గుర్తు చేయడంతో తప్పేముందని ఆయన ప్రశ్నించారు.

ఐసీసీని సంప్రదించిన పీసీబీ
ఇరు దేశాల మధ్య సిరీస్‌లు జరగాలని మాత్రం మర్యాదపూర్వకంగానే బీసీసీఐతో పాటు ఐసీసీని సంప్రదించినట్లు ఆయన తెలిపారు. చివరగా 2007లో భారత్‌లో ఇరుదేశాలు మధ్య సిరీస్ జరిగిన విషయాన్ని షహర్యార్ ఖాన్ గుర్తుచేశారు. అయితే 2007లో ఏర్పాటు చేసిన పూర్తిస్థాయి ద్వైపాక్షిక సిరీస్‌లాగా కాకుండా కనీసం రెండు హోమ్ సిరీస్‌లను ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు.

ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు
ఇటీవల కాలంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న నేపథ్యంలో అటు కేంద్రం గానీ, ఇటు బీసీసీఐగానీ ద్వైపాక్షిక సిరీస్ సిరీస్‌లపై ఆసక్తి చూపించడంలేదన్నారు. అవసరమైతే ఈ విషయాన్ని డిసెంబర్ 7వ తేదీన కొలంబోలో జరిగే ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పారు.

న్యాయవాదులతో చర్చిస్తున్నాం
అంతేకాదు ఒప్పందం ప్రకారం భారత్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లను శ్రీలంకతో నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ, బీసీసీఐ ముందుకు రావడం లేదని షహర్యార్ ఖాన్ తెలిపారు. ఈ విషయంతో పాటు, భారత్ తమతో చేసుకున్న ఒప్పందంపై మా న్యాయవాదులతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు.

మేమేమీ అడుక్కోవడం లేదు
‘మాతో క్రికెట్ ఆడమని మేమేమీ అడుక్కోవడం లేదు. 2015-23 మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని ఒప్పందం కుదిరింది. కానీ, బీసీసీఐ అందుకు కట్టుబడలేదు' అని షహర్యార్ న్నారు. ఇరుదేశాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉండేలా ఒత్తిడి తేవడం తమ హక్కని ఆయన చెప్పారు.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా షహర్యార్ ఖాన్
షహర్యార్ ఖాన్ ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2007లో చివరిసారిగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. ఈ సిరిస్‌లో భాగంగా పాకిస్థాన్ జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. కాగా, అంతర్జాతీయ టోర్నీల్లో భారత్, పాక్ జట్లను ఒకే గ్రూపులో ఉంచొద్దంటూ ఐసీసీని బీసీసీఐ కోరింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications