మాకు 60 ఏళ్లు లేవు: ‘డాడీస్ ఆర్మీ’ ఎగతాళి వ్యాఖ్యలపై డ్వేన్ బ్రావో


హైదరాబాద్: వయసుకు ఆట ముఖ్యం కాదు, అనుభవం ముఖ్యమని ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న డ్వేన్ బ్రావో అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని 'డాడీస్ ఆర్మీ'అంటూ ఎగతాళి చేస్తున్న వారిపై డ్వేన్ బ్రేవో ఆగ్రహం వ్యక్తం చేశాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
డ్వేన్ బ్రావో మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం డ్వేన్ బ్రావో మాట్లాడుతూ "మా వయసు గురించి మాకు తెలుసు. ఇంకొకరు చెప్పక్కర్లేదు. సీఎస్‌కే ఆటగాళ్ల వయసు 32-35 మధ్యే ఉంది. మా జట్టులోని ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉన్నారు. మాకు అరవై ఎళ్లు లేవు. వయసు కాదు ఆట, ఆనుభవం ముఖ్యం. ఈ విషయాన్ని క్రికెట్ మేధావులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏమో" అని అన్నాడు.
ఇతర విభాగాల్లో బాగా రాణిస్తాం
మరోవైపు ధోని మాట్లాడుతూ "మేం మంచి ఫీల్డింగ్ చేయకపోయినా ఇతర విభాగాల్లో బాగా రాణిస్తాం. అక్కడక్కడా కొన్ని పరుగులు వదిలేసినా, మా అనుభవంతో నెగ్గుకొస్తాం. అయితే ఆ లోటును బ్యాటింగ్, బౌలింగ్‌తో పూడుస్తున్నాం. మా బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. చివరి ఓవర్లలో ఇంకా బాగా ఆడాల్సి వుంది. ఫీల్డింగ్ లోపాలపై దృష్టి పెడతాం. అయినా ఇది మాకు మంచి గెలుపు" అని అన్నాడు.
చెన్నై బౌలర్లపైనా ధోని ప్రశంసలు
అదే విధంగా ఢిల్లీ క్యాపిటల్స్‌ని తక్కువ పరుగులకే కట్టడి చేసిన చెన్నై బౌలర్లపైనా ధోని ప్రశంసల వర్షం కురిపించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీని చెన్నై బౌలర్లు కట్టడి చేయడంతో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం వాట్సన్(44), ధోని(35 నాటౌట్) రాణించడంతో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications