Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తలనొప్పి మంచిదే: 'రాహుల్‌ని జాగ్రత్తగా గమనిస్తున్నాం'

హైదరాబాద్: బలమైన రిజర్వ్‌ బెంచ్‌ ఉండటం భారత జట్టుకు మంచిదని టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి అన్నాడు. గురువారం కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంకతో రెండో టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు.

గట్టి పోటీ ఉండటం మంచి తలనొప్పి లాంటిదే

గట్టి పోటీ ఉండటం మంచి తలనొప్పి లాంటిదే

తుది జట్టులో చోటు కోసం గట్టి పోటీ ఉండటం ‘మంచి తలనొప్పి' లాంటిదని రవిశాస్త్రి చెప్పాడు. వైరల్ ఫీవర్ కారణంగా తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్ లోకేశ్ రాహుల్ ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టామని రవిశాస్త్రి అన్నాడు. జ్వరం నుంచి పూర్తిగా కోలుకున్న రాహుల్.. లంకతో రెండు టెస్టు సన్నాహాకాల్లో భాగంగా మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు.

నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్

నెట్ ప్రాక్టీస్‌లో కేఎల్ రాహుల్

నెట్ ప్రాక్టీస్‌లో రాహుల్ బాగా ఆడుతున్నాడని రవిశాస్త్రి చెప్పాడు. 'రాహుల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాడు. అతన్ని జాగ్రత్తగా గమనిస్తున్నాం. జ్వరం కారణంగా రెండు, మూడు రోజులపాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. అందుకే రాహుల్‌తో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. రోజురోజుకు అతను మెరుగవుతున్నా.. ఫిట్‌నెస్‌ను బట్టి తుది జట్టు ఎంపిక ఉంటుంది' అని శాస్త్రి అన్నాడు.

రిజర్వ్ ఆటగాళ్లపై కెప్టెన్ కోహ్లీ

రిజర్వ్ ఆటగాళ్లపై కెప్టెన్ కోహ్లీ

మూడు ఫార్మాట్లు ఆడుతున్న క్రమంలో ఎవరెప్పుడు గాయపడతారో తెలియదని మరొకరు సిద్ధంగా ఉండటం మేలేనని అన్నారు. మరోవైపు ప్రస్తుతం జట్టులో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం నెలకొన్నదని, ఎవరైనా ఆటగాడు గాయం కారణంగా దూరమైనా భర్తీ చేసేందుకు రిజర్వ్ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని కెప్టెన్ కోహ్లీ అన్నాడు.

రెండో టెస్ట్‌కు గుణరత్నె స్థానంలో తిరిమానే

రెండో టెస్ట్‌కు గుణరత్నె స్థానంలో తిరిమానే

భారత్‌తో రెండో టెస్టుకు లాహీరు తిరిమానేను లంక జట్టు ఎంపిక చేసింది. తొలి టెస్ట్‌లో గాయపడి సిరీస్‌కు పూర్తిగా దూరమైన గుణరత్నే స్థానంలో తిరిమానేను తీసుకున్నట్లు లంక బోర్డు తెలిపింది. గతేడాది జూన్‌లో చివరి టెస్ట్ ఆడిన తిరిమానే తన కెరీర్‌లో 26 టెస్టులు ఆడాడు. మరోవైపు న్యూమోనియాతో గాలే టెస్టుకు దూరమైన రెగ్యులర్ కెప్టెన్ దినేశ్ చండీమల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు వెన్ను నొప్పితో ఇబ్బందిపడుతున్న పేసర్‌ లక్మల్‌ స్థానంలో స్పిన్నర్‌ లక్షణ్‌ సందాకన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు సమాచారం.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+