రోహిత్ ఫైర్: మేం భారతీయులం.. హిందీలోనే మాట్లాడతాం!!

ముంబై: లైవ్‌చాట్‌లో మాట్లాడుతుండగా కామెంట్ చేసిన అభిమానులపై టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మేం భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని రోహిత్ స్పష్టం చేశాడు. దేశంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ సోషల్ మీడియాలో పలువురు క్రికెటర్లతో లైవ్‌చాట్ చేస్తున్నాడు. ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్‌సన్‌తో లైవ్‌చాట్ చేయగా.. తాజాగా టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో లైవ్‌చాట్‌లో పాల్గొన్నాడు.

హిందీలోనే మాట్లాడతాం:
లైవ్‌చాట్‌లో బుధవారం జస్ప్రీత్ బుమ్రాతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ హిందీలో మాట్లాడుతుండగా.. కొందరు అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని అడిగారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రోహిత్.. అభిమానులు ఇంగ్లీష్‌లో మాట్లాడమని చెబుతున్నారని, తాము భారతీయులం అయినందున హిందీలోనే మాట్లాడతామని ఆగ్రహం వ్యక్తం చేసాడు. టీవీ ఇంటర్వ్యూల్లో ఇంగ్లీష్‌లోనే మాట్లతానని, ప్రస్తుతం ఇంట్లో ఉన్నందున హిందీలో మాట్లాడుతా అని అభిమానులకు ధీటుగా జవాబిచ్చాడు.

రోహిత్‌కు బుమ్రా అండ:
ఆపై జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ రోహిత్‌కు అండగా నిలిచాడు. 'మనం హిందీలో మాట్లాడితే వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడమంటారు, ఇంగ్లీష్‌లో మాట్లాడితే హిందీలో మాట్లాడమంటారు' అని అన్నాడు. మరోవైపు మహమ్మారి కరోనా వైరస్ వల్ల ఇలాంటి కఠిన పరిస్థితులు తలెత్తుతాయని న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా నేను ఎప్పుడూ ఊహించలేదని బుమ్రా తెలిపాడు.

ఇంట్లోనే ఉండి, తరచూ చేతులు కడుక్కోవాలి:
అనంతరం రోహిత్ మాట్లాడాడు. వైరస్ వ్యాప్తి వల్ల అన్ని క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోయాయన్నాడు. దీన్నిబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అర్థం చేసుకోవాలని కొందరు అభిమానులనుద్దేశించి హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ప్రతి ఒక్క పౌరుడిని ఇంట్లోనే ఉండి, తరచూ చేతులు కడుక్కోవాలని రోహిత్ సూచించాడు. మనం మాత్రమే కాకుండా మన పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరాడు. కరోనాతో జరిగే యుద్ధంలో మనం విజయం సాధిస్తామన్నాడు.

కరోనా కోసం రోహిత్ భారీ విరాళం:
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జరుగుతున్న పోరాటంలో రోహిత్ శర్మ కూడా భాగం అయిన విషయం తెలిసిందే. మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. రోహిత్ సాయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications