Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ బ్యాటింగ్ ఓకే, బౌలింగ్ బలహీనం... దానిపైనే దృష్టి పెట్టాం: బంగ్లాదేశ్ కోచ్

మెల్‌బోర్న్: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్స్‌లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ కోచ్ ఛండిక హతురుసింఘే మాట్లాడుతూ భారత్ జట్టు బ్యాటింగ్ బాగుందని, అయితే బౌలర్లు ఏవిధంగా రాణిస్తారనే దానిపై వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

బ్యాటింగ్‌ లైనప్‌తో పోల్చితే, బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్న నేపథ్యంలో తాము ఆ ఆంశంపైనే ఎక్కువ దృష్టి పెడతామని అన్నారు. లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించడంపై స్పందిస్తూ, తాము ఎవరికీ, దేనికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

 We are good and that's why we are here, says Bangladesh coach

వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లో జట్టు సమిష్టిగా రాణిస్తే అధ్బుతమైన విజయాలను నమోదు చేయవచ్చని, మంచి జట్టు కాబట్టే తాము క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించామన్నారు. 46ఏళ్ల ఛండిక హతురుసింఘే శ్రీలంక జట్టు తరుపున 1991 నుంచి 1999 వరకు ఓపెనర్‌గా రాణించారు.

శ్రీలంక తరుపున 26 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. మార్చి 19 (గురువారం) బంగ్లాదేశ్‌తో రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడనుంది. వరల్డ్ కప్ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. వరల్డ్ కప్‌లో లీగ్ మ్యాచ్‌ల్లో పూల్ బీలో భారత్ తలపడిన పాకిస్ధాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్టిండిస్, ఐర్లాండ్‌, జింబాబ్వేలను చిత్తుగా ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+