Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'లంక పర్యటనలో అంతా ఆహ్లాదకర వాతావరణం ఉండబోతోంది'

హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి, బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్‌లు ఎంపిక కావడంతో జట్టులో సరదా వాతావరణాన్ని మరోసారి చూడబోతున్నట్లు పేసర్ ఉమేశ్ యాదవ్ తెలిపాడు. గతంలో వారిద్దరితో పని చేసిన అనుభవాన్ని ఉమేశ్ యాదవ్ మీడియాతో షేర్ చేసుకున్నాడు.

మాజీ కోచ్ అనిల్ కుంబ్లే పర్యవేక్షణలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పిన ఉమేశ్ ఇక భారత జట్టులో అంతా ఆహ్లాదకర వాతావరణం ఉండబోతుందని చెప్పుకొచ్చాడు. లంక పర్యటనకు బయల్దేరే ముందు ఇండియా టుడేతో ఉమేశ్ యాదవ్ మాట్లాడాడు.

 We are going to have a lot of fun in Sri Lanka: Umesh Yadav

కోచ్‌లుగా రవిశాస్త్రి, భరత్ అరుణ్‌ల పునరాగమనాన్ని జట్టు సభ్యులంతా స్వాగతిస్తున్నట్లు తెలిపాడు. 'ఈ కోచింగ్ స్టాఫ్‌తో గతంలో నేను పని చేశాను. వారి పని చేసే విధానం ఏమిటో మాకు బాగా తెలుసు. ప్రత్యేకంగా మ్యాచ్ లు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరి వ్యూహాలపై మాకు చక్కటి అవగాహన ఉంది' అని అన్నాడు.

'రవిశాస్త్రి, భరత్ అరుణ్‌లు సరదా అయిన మనుషులు. వారిద్దరి రాకతో శ్రీలంక పర్యటన సరదా సరదాగానే ఉండబోతుంది' అని ఉమేశ్ అభిప్రాయపడ్డాడు. మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 సిరీస్‌ కోసం బుధవారం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా లంకకు వెళ్లింది.

జులై 26 నుంచి గాలే వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+