ఎదురు చూస్తున్నాం: ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై కోహ్లీ మాటిది!

హైదరాబాద్: గొప్ప ఉత్సాహంతో ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నామని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. సంప్రదాయ టెస్టు క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
న్యూజిలాండ్‌లోని అక్లాండ్ వేదికగా గతేడాది జరిగిన ఐసీసీ బోర్డు వార్షిక సమావేశంలో ఛైర్మన్ శశాంక్ మనోహర్ నేతృత్వంలోని ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా టెస్ట్ హోదా పొందిన తొమ్మిది జట్లతో టెస్ట్ క్రికెట్ లీగ్‌ను ఐసీసీ నిర్వహిస్తోంది.
మొత్తం రెండేళ్లపాటు జరిగే ఈ లీగ్‌లో మూడు స్వదేశీ సిరీస్‌లు, మూడు విదేశీ సిరీస్‌లుగా నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనే మొత్తం తొమ్మిది జట్ల మధ్య 27 ద్వైపాక్షిక సిరీస్‌లు నిర్వహించనున్న ఐసీసీ చివరకు ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతను నిర్ణయిస్తుంది.

ఆగస్టు 1న ప్రారంభమయ్యే
ఆగస్టు 1న ప్రారంభమయ్యే యాషెస్ టెస్టు సిరిస్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌కు ఐసీసీ శ్రీకారం చుట్టింది. తొలి లీగ్‌లో భాగంగా ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టెస్టు హోదా కలిగిన మొత్తం టీమిండియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో కలిసి 9 దేశాలు పాల్గొంటున్నాయి. 2019 ఆగస్టు 1 నుంచి 2021 ఏప్రిల్ 30 మధ్య కాలంలో ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లీగ్ జరగనుంది.

టెస్టు హోదాను కలిగి ఉన్న మొత్తం 9 దేశాలు
టెస్టు హోదాను కలిగి ఉన్న మొత్తం 9 దేశాలు కూడా స్వదేశంలో మూడు, విదేశాల్లో మూడు సిరిస్‌లు ఆడతాయి. ఈ సిరీస్‌ల్లో అత్యధిక పాయింట్లు సాధించిన మొదటి రెండు జట్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా 2021 జూన్‌లో జరిగే ఫైనల్లో తలపడతాయి. బర్మింగ్ హామ్ వేదికగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న తొలి యాషెస్ టెస్టుతో ఈ లీగ్‌కు తెరలేవనుంది.

కోహ్లీ మాట్లాడుతూ
ఈ నేపథ్యంలో ఐసీసీ మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడుతూ "సుదీర్ఘ ఫార్మాట్‌కు తిరిగి పూర్వా వైభవం తీసుకొచ్చే ఈ ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. టెస్టు క్రికెట్ ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. అలాంటి సంప్రదాయ ఫార్మాట్‌లో అగ్రస్థానంలో ఉండటం ఎప్పటికీ సంతోషమే. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఫార్మాట్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఈ నేపథ్యంలో టెస్టు ఛాంపియన్‌షిప్‌ను నిలబెట్టుకుంటాం" అని విరాట్ కోహ్లీ చెప్పాడు.

120 పాయింట్లు చొప్పున
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌తో సంబంధం లేకుండా 120 పాయింట్లు చొప్పున ఐసీసీ కేటాయించింది. దీంతో ఒక్కో జట్టుకు అత్యధికంగా 720 పాయింట్లు సాధించే అవకాశం ఉంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్ షిప్‌లో భాగంగా టీమండియా తన సిరిస్‌ను కరేబియన్ పర్యటనతో ప్రారంభించనుంది.

వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనున్న టీమిండియా
సోమవారం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 వన్డేలు, 3 టీ20లు, 2 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది. ఈ రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌తో టీమిండియా టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2019 అక్టోబర్‌లో దక్షిణాఫ్రికా వేదికగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియాతో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications