Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమి పట్ల తీవ్ర బాధ: ఇనిస్టాగ్రామ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడి

India vs England 2018 5th Test : Shikhar Dhawan Talks About Match Performence
We are also hurt the way you guys are: Shikhar Dhawans message on Instagram

హైదరాబాద్: 11 ఏళ్ల తర్వాత టెస్టు సిరీస్‌ గెలిచేందుకు ఇంగ్లాండ్‌ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా ఈసారీ బోల్తా పడింది. నాలుగేళ్ల క్రితం తన దారుణ వైఫల్యాన్ని అధిగమించిన కెప్టెన్‌ కోహ్లీ ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో అభిమానులను సంతోషపెట్టాడు కానీ.. జట్టు మాత్రం ఆ మేరకు రాణించలేకపోయింది.

నాలుగో టెస్టులో గెలిచే అవకాశం

నాలుగో టెస్టులో గెలిచే అవకాశం

సౌతాంప్టన్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో గెలిచే అవకాశం వచ్చినప్పటికీ దానిని జారవిడుచుకోవడంతో అటు మ్యాచ్‌తో పాటు ఇటు సిరీస్‌ 1-3తో చేజార్చుకుంది. ఈ ఓటమిపై జట్టులోని ఆటగాళ్లు కూడా అభిమానుల్లాగే ఓటమి పట్ల తీవ్ర బాధతో ఉన్నారని ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు.

 ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు

ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ఐదో టెస్టు

ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా చివరిదైన ఐదో టెస్టు శుక్రవారం నుంచి ఓవల్ వేదికగా ప్రారంభం కానుంది. ఈ నేఫథ్యంలో శిఖర్ ధావన్ మాట్లాడుతూ "ఓటమి పట్ల ప్రతికూలంగా రాస్తున్నారు కానీ అభిమానుల్లాగే మేం కూడా చాలా బాధపడ్డాం. తప్పులు నుంచి నేర్చుకొని ముందుకెళ్లడం ముఖ్యం" అని అన్నాడు.

శక్తిమేర ఆడి విజయాల కోసం పోరాడతాం

శక్తిమేర ఆడి విజయాల కోసం పోరాడతాం

"మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే అనుకుంటాం. గతాన్ని మనం మార్చలేం. ఎప్పటిలాగే మా శక్తిమేర ఆడి విజయాల కోసం పోరాడతాం. ప్రాక్టీస్‌ తర్వాత సరాదాగా ఉండి తీరాలి. అందుకే జట్టులో సానుకూల పరిస్థితిని మెరుగుపర్చుకుంటున్నాం. ఛాంపియన్లు ఇలాగే చేస్తారు" అని ధావన్ తెలిపాడు.

సానుకూలంగా ఉండేవాళ్లే యోధులు

సానుకూలంగా ఉండేవాళ్లే యోధులు

"గెలిచినపుడు బాగానే ఉంటుంది. కానీ ఓడినపుడు కూడా సానుకూలంగా ఉండేవాళ్లే యోధులు. మ్యాచ్‌కు ముందు రోజు మానసిక స్థైర్యం కలిగి ఉండడం ప్రధానం. ఇప్పటికీ మాకు మద్దుతుగా నిలుస్తున్న అభిమానులకు ధన్యవాదాలు" అని శిఖర్ ధావన్ ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు.

Story first published: Friday, September 7, 2018, 12:40 [IST]
Other articles published on Sep 7, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+