WCL 2025: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(WCL) 2025 బర్మింగ్‌హామ్‌లో జులై 18 నుంచి ప్రారంభమైంది. ఇందులో క్రికెట్ దిగ్గజాలకు చెందిన 6 జట్లు పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, వెస్టిండీస్ దేశాలకు చెందిన లెజెండ్స్ జట్లు ఈ టీ20 ఫార్మాట్ టోర్నమెంట్‌లో పోటీ పడుతున్నాయి. యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో భాగమవుతున్నారు. వరల్డ్ ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడబడతాయి. లీగ్ దశలో అన్ని జట్లు ఒకదానితో ఒకటి ఒక్కోసారి తలపడతాయి. ఆ తర్వాత సెమీ ఫైనల్ మ్యాచ్‌లు జులై 31న, ఫైనల్ ఆగస్టు 2న జరుగుతాయి. అన్ని లెజెంట్ల వివరాలు ఇవే..

ఇంగ్లాండ్ చాంపియన్స్: ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, అలిస్టర్ కుక్, ఇయాన్ బెల్, రవి బొపారా, సమిత్ పటేల్, లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్, అజ్మల్ షెహజాద్, డిమిత్రి మస్కరేన్హాస్, ఫిల్ మస్టర్డ్,టిమ్ ఆంబ్రోస్, ర్యాన్ సైడ్‌బాటమ్, స్టువర్ట్ మీకర్, ఉస్మాన్ అఫ్జల్.
భారత ఛాంపియన్స్: యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్ధార్థ్ కౌల్, గుర్కీరత్ మాన్.
దక్షిణాఫ్రికా చాంపియన్స్: ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, ఆల్బీ మోర్కెల్, జేపీ డుమిని, ఇమ్రాన్ తాహిర్, వేన్ పార్నెల్, జేజే స్మట్స్, హార్డస్ విల్జోయెన్, రిచర్డ్ లెవీ, డెన్ విలాస్, ఎస్‌జే ఎర్వీ, డువాన్ ఒలివియర్, మోర్నే వాన్ విక్, ఆరోన్ ఫాంగిసో.
వెస్టిండీస్ ఛాంపియన్స్: క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, లెండిల్ సిమన్స్, డ్వేన్ స్మిత్, షెల్డన్ కాట్రెల్, శివనారాయణ్ చందర్‌పాల్, చాడ్విక్ వాల్టన్, షానన్ గాబ్రియెల్, ఆష్లే నర్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, విలియం పెర్కిన్స్, సులేమాన్ బెన్, డేవ్ మహమ్మద్, నికితా మిల్లర్.
పాకిస్థాన్ ఛాంపియన్స్: మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, షర్జీల్ ఖాన్, వహాబ్ రియాజ్, ఆసిఫ్ అలీ, షాహిద్ అఫ్రిది, కమ్రాన్ అక్మల్, ఆమిర్ యామీన్, సోహైల్ ఖాన్, సోహైల్ తన్వీర్.