ముంబై: ప్రపంచ కప్ ట్వంటీ 20లో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ సేన గురువారం రాత్రి ఏడున్నర గంటలకు సెమీ ఫైనల్లో వెస్టిండీస్‌తో ఢీకొనబోతుంది. అయితే, ఈ రెండు జట్లు తలపడే వాంఖేడే స్టేడియం భారత జట్టుకు అదృష్ట వేదిక కాదనే చెప్పవచ్చు.
విండీస్, భారత్‌లలో గెలిచిన జట్టు తర్వాత ఫైనల్లో ఇంగ్లాండుతో తలపడనుంది. ఫైనల్ మ్యాచ్ రానున్న బుధవారం కోల్‌కతాలో జరగనుంది.
ఇదిలా ఉండగా, ముంబై వాంఖేడే స్టేడియం భారత్‌కు లక్కీ కాదని చరిత్ర చెబుతోంది. గతంలో రెండుసార్లు సెమీ ఫైనల్లో భారత్.. వాంఖేడేలో ఓడింది. ఇదే వాంఖేడేలో 2011లో భారత్ శ్రీలంక పైన గెలిచి ప్రపంచ కప్ గెలిచింది.

1987లో...
1987లో రిలయన్స్ వరల్ట్ కప్ సెమీ ఫైనల్లో కపిల్ దేవ్ సేన వాంఖేడే స్టేడియంలో ఓడింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్... ఇంగ్లాండు చేతిలో సెమీ ఫైనల్లో ఓడింది. 35 పరుగులతో ఓడింది. ఇంగ్లాండ్ 254 పరుగులు చేస్తే, భారత్ 219 పరుగులే చేసి ఓడింది.
1989లో...
రెండోసారి నెహ్రూ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఓడింది. వెస్టిండీస్ చేతిలో 8 వికెట్ల చేతిలో నాడు శ్రీకాంత్ సేన ఓడింది. ఆ ఓటమి తర్వాత ఎంతోకాలం శ్రీకాంత్ కెప్టెన్‌గా నిలబడలేదు.
మరో విషయమేమంటే.. ఓడిన ఆ రెండుసార్లు (1987, 1989) సెమీ ఫైనల్స్ వాంఖేడేలో జరిగాయి. అప్పుడు రెండుసార్లు భారత్ ఓడిది. పైగా.. నాడు ఫైనల్ మ్యాచులు కూడా ఇప్పటిలాగే కోల్‌కతాలో జరిగాయి. ఇప్పుడు కూడా ఫైనల్ కోల్‌కతాలోనే ఉంది.
1996 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. ఈ ఓటమి కోల్‌కతాలో చవి చూసింది. హీరో కప్ సెమీ ఫైనల్‌ను మాత్రం దక్షిణాఫ్రికా పైన భారత్ అదే కోల్‌కతాలో గెలిచింది. 1993లో ఈ గెలుపు చోటు చేసుకుంది.