Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వ‌రుణుడు మ‌ళ్లీ డ్యూటీ ఎక్కేశాడు! ఆసీస్ భారీ స్కోరు..తేలిపోయిన బంగ్లా బౌల‌ర్లు!

WC Match between Australia and Bangladesh stopped by Rain

నాటింగ‌హామ్‌: ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా ఇంగ్లండ్‌లోని నాటింగ్‌హామ్ ట్రెంట్‌బ్రిడ్జి స్టేడియంలో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోన్న మ్యాచ్‌కు వ‌రుణ దేవుడు అడ్డుప‌డ్డాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్ ముగుస్తుంద‌న‌గా.. వ‌ర్షం కురిసింది. లావుపాటి చినుకుల‌తో వ‌ర్షం మొద‌లైంది. దీనితో మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు అంపైర్లు. మ్యాచ్ నిలిచిపోయే స‌మ‌యానికి ఆస్ట్రేలియా తిరుగులేని స్కోరును సాధించింది. స‌రిగ్గా 49 ఓవ‌ర్ల‌లు అయిదు వికెట్ల న‌ష్టానికి 368 ప‌రుగులు సాధించింది.

1
43669
ఎడా పెడా బాదేసిన డేవిడ్ వార్న‌ర్‌..

ఎడా పెడా బాదేసిన డేవిడ్ వార్న‌ర్‌..

ఆస్ట్రేలియా ఇన్నింగ్‌లో ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్ బ్యాటింగ్ హైలైట్‌. అద్భుతంగా ఆడాడు. అల‌వోక‌గా బౌండ‌రీలు, సిక్స‌ర్లు బాదేశాడు. బంగ్లాదేశ్ బౌలింగ్‌ను తొక్కి ప‌డేశాడు. తుత్తునీయ‌లు చేశాడు. 147 బంతుల్లో అయిదు సిక్స‌ర్లు, 14 ఫోర్ల‌తో 166 ప‌రుగులు చేశాడు. ఓ ద‌శ‌లో డ‌బుల్ సెంచ‌రీ సాధిస్తాడా? అనేలా అత‌ని బ్యాటింగ్ కొన‌సాగింది. చివ‌రికి- సౌమ్య స‌ర్కార్ బౌలింగ్‌లో హుక్ షాట్ కొట్ట‌బోయి డీప్ మిడ్ వికెట్‌లో రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. డేవిడ్ వార్న‌ర్‌తో పాటు ఇన్నింగ్‌ను ఆరంభించిన కేప్టెన్ అరోన్ ఫించ్ సైతం బ్యాట్ ఝుళిపించాడు.

వార్న‌ర్‌కు తోడుగా ఫించ్ ..

వార్న‌ర్‌కు తోడుగా ఫించ్ ..

చాన్నాళ్ల త‌రువాత ట‌చ్‌లోకి వ‌చ్చిన ఆత్మ‌విశ్వాసంతో ఆడాడు. 51 బంతుల్లో రెండు సిక్స‌ర్లు, అయిదు ఫోర్ల‌తో 53 ప‌రుగులు చేశాడు. సౌమ్య స‌ర్కార్ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. రుబెల్‌కే క్యాచ్ ఇచ్చాడు. ఫించ్ అవుటైన త‌రువాత వ‌న్‌డౌన్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులోకి వ‌చ్చిన ఉస్మాన్ ఖ‌వాజా సైతం దూకుడుగా ఆడాడు. అర్ధ సెంచ‌రీని సాధించాడు. 72 బంతుల్లో 89 ప‌రుగులు చేసి సౌమ్య‌స‌ర్కార్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

 మ్యాక్స్‌వెల్ సుడిగాలి బ్యాటింగ్‌..

మ్యాక్స్‌వెల్ సుడిగాలి బ్యాటింగ్‌..

అనంత‌రం బ‌రిలో దిగిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ సుడిగాలి ఇన్నింగ్ ఆడాడు. ప‌ది బంతులను మాత్ర‌మే ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్ మూడు సిక్స‌ర్లు, రెండు బౌండ‌రీల‌తో 32 ప‌రుగులు చేసి, ర‌నౌట్ అయ్యాడు. రుబెల్ వేసిన డైరెక్ట్ త్రోకు పెవిలియ‌న్ దారి ప‌ట్టాడు. ఓ ద‌శ‌లో 400 మార్క్‌ను దాటుతుంద‌నిపించేలా క‌నిపించిన ఆస్ట్రేలియా జ‌ట్టు..చివ‌ర్లో వెంట‌వెంట‌నే వికెట్ల‌ను కోల్పోయింది.

49 ఓవ‌ర్ల ముగిసేస‌రికి..

49 ఓవ‌ర్ల ముగిసేస‌రికి..

మ్యాక్స్‌వెల్ అవుటైన త‌రువాత బ్యాటింగ్‌కు వ‌చ్చిన స్టీవెన్ స్మిత్ ఎక్కువ సేపు క్రీజులో నిల్చోలేక‌పోయాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఏడు బంతుల్లో ఆరు ప‌రుగులు చేసి, తిరుగుముఖం ప‌ట్టాడు. అలెక్స్ కేరీ, మార్క‌స్ స్టాయినిస్ క్రీజులో ఉన్న స‌మ‌యంలో వ‌ర్షం కురిసింది. అప్ప‌టికి 49 ఓవ‌ర్లు పూర్త‌య్యాయి. స్టాయినిస్ ఆరు ప‌రుగులు, అలెక్స్ కేరీ తొమ్మిది ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

మూడు వికెట్ల‌తో రాణించిన సౌమ్య స‌ర్కార్‌

మూడు వికెట్ల‌తో రాణించిన సౌమ్య స‌ర్కార్‌

బంగ్లాదేశ్ బౌల‌ర్లు ఎవ‌రూ ఆశించిన స్థాయిలో ఈ మ్యాచ్‌లో రాణించ‌లేక‌పోయారు. ధారాళంగా ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నారు. ష‌కిబ్ ఉల్ హ‌స‌న్‌, ముష్ర‌ఫా మొర్తాజా, ముస్తాఫిజుర్ రెహ్మాన్‌, రుబెల్ హొస్సైన్‌, మెహ‌దీ హ‌స‌న్‌, చివ‌రికి సౌమ్య స‌ర్కార్ కూడా ఆసీస్ బ్యాట్స్‌మెన్ల ముందు నిల‌వ‌లేక‌పోయారు. రుబెల్ హొస్సైన్ భారీగా ప‌రుగుల‌ను స‌మ‌ర్పించుకున్నాడు. తొమ్మిది ఓవ‌ర్లు వేసిన రుబెల్‌.. ఒక్క వికెట్ కూడా తీసుకోలేక‌పోయాడు గానీ 83 ప‌రుగులు ఇచ్చుకున్నాడు.

స్పిన్న‌ర్ ష‌కిబ్ అల్ హ‌స‌న్ సైతం ప్ర‌భావం చూప‌లేక‌పోయాడు. ష‌కిబ్ వేసిన ఆరు ఓవ‌ర్ల‌లోనే 50 ప‌రుగులను పిండుకున్నారు ఆస్ట్రేలియా హిట్ట‌ర్లు. సౌమ్య స‌ర్కార్ ఒక్క‌డే కాస్త ఫ‌ర్వాలేద‌నిపించుకున్నాడు. కీల‌క‌మైన మూడు వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడు. ఎనిమిది ఓవ‌ర్ల‌లో 58 ప‌రుగుల‌ను ఇచ్చుకున్న‌ప్ప‌టికీ.. ఫించ్‌, డేవిడ్ వార్న‌ర్‌, ఉస్మాన్ ఖ‌వాజా వికెట్ల‌ను తీసుకున్నాడు.

Story first published: Thursday, June 20, 2019, 19:16 [IST]
Other articles published on Jun 20, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+