ప్రపంచ కప్ నుంచి కంగారులు ఔట్

ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడడంతో గ్రూప్ 'సి' నుంచి శ్రీలంక, వెస్టిండీస్ సూపర్ 8లో అడుగుపెట్టాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ ను అజంత మెండిస్ (3/20) తన స్పిన్ మాయాజాలంతో దెబ్బతీశాడు. ఐతే ఆఖర్లో మిచెల్ జాన్సన్ (28 నాటౌట్; 13 బంతుల్లో 2X4, 2X6) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. స్కోరు బోర్డుపై ఒక పరుగు చేరిందో లేదో ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0) ఔటయ్యాడు. మూడు ఓవర్లు ముగిసేసరికి స్కోరు 9 పరుగులు మాత్రమే. కానీ తర్వాతి రెండు ఓవర్లలో స్కోరు అమాంతం పెరిగింది. నాలుగో ఓవర్లో వాట్సన్ (22; 21 బంతుల్లో 2X4, 1X6) వరుసగా రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగా ఐదో ఓవర్లో పాంటింగ్ (25; 15 బంతుల్లో 5X4) హ్యాట్రిక్ బౌండరీలు సాధించాడు. మెండిస్ వరుస ఓవర్లలో ఈ ఇద్దరి పెవిలియన్ చేర్చి ఆసీస్‌ను దెబ్బతీశాడు. పాంటింగ్ క్లీన్ బౌల్డ్‌కాగా వాట్సన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. హడిన్ (16), మైకేల్ క్లార్క్ (11), మైక్ హసి (1) త్వరగా ఔటై ఆసీస్‌ను కష్టాల్లోకి నెట్టారు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 94/6 మాత్రమే. అయినా ఆ జట్టు స్కోరు 159కి చేరిందంటే అది డేవిడ్ హసి (28; 22 బంతుల్లో 1X4, 2X6), జాన్సన్‌ల చలవే. ఇద్దరూ చెలరేగడంతో చివరి 5 ఓవర్లలో ఆసీస్ 65 పరుగులు పిండుకుంది.
ఆస్ట్రేలియా: వాట్సన్ ఎల్బీ (బి) మెండిస్ 22; వార్నర్ (సి) దిల్షాన్ (బి) మాథ్యూస్ 0; పాంటింగ్ (బి) మెండిస్ 25; హడిన్ (బి) మలింగ 16; క్లార్క్ (సి) అండ్ (బి) ఉదాన 11; డేవిడ్ హసి (సి) జయసూర్య (బి) ఉదాన 28; మైకెల్ హసి ఎల్బీ (బి) మెండిస్ 1; జాన్సన్ నాటౌట్ 28; బ్రెట్ లీ (బి) మలింగ 15; హారిట్జ్ (సి) సంగక్కర (బి) మలింగ 4; బ్రాకెన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 159, వికెట్ల పతనం: 1-1, 2-48, 3-59, 4-74, 5-79, 6-94, 7-135, 8-151, 9-155
బౌలింగ్: మాథ్యూస్ 2-0-10-1; జయసూర్య 2-0-17-0; ఉదాన 4-0-47-2; మలింగ 4-0-36-3; మెండిస్ 4-0-20-3; మురళీధరన్ 4-0-29-0
శ్రీలంక ఇన్నింగ్స్: దిల్షాన్ (బి) క్లార్క్ 53; జయసూర్య (సి) వార్నర్ (బి) లీ 2; సంగక్కర నాటౌట్ 55; జయవర్ధనే (సి) బ్రాకెన్ (బి) హారిట్జ్ 9; చమర సిల్వ (సి) పాంటింగ్ (బి) లీ 11; ముబారక్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (19 ఓవర్లలో 4 వికెట్లకు) 160, వికెట్ల పతనం: 1-19, 2-81, 3-98, 4-127
బౌలింగ్: లీ 4-0-39-2; జాన్సన్ 2-0-17-0; బ్రాకెన్ 4-0-33-0; వాట్సన్ 2-0-24-0; హారిట్జ్ 4-0-27-1; క్లార్క్ 3-0-19-1.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications