Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సంగక్కరకు చేదు: సౌతాఫ్రికాకు సచిన్, ఫ్యాన్స్ థ్యాంక్స్! గెలుపుపై ట్వీట్స్

సిడ్నీ: ప్రపంచ కప్‌లో భాగంగా క్వార్టర్ ఫైనల్లో శ్రీలంకను ఓడించిన దక్షిణాఫ్రికా జట్టుకు భారత అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు! ఈ ప్రపంచ కప్‌లో శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర వరుసగా నాలుగు సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. గత టోర్నీలో ఒక సెంచరీ చేశాడు. అతను మరో సెంచరీ చేస్తే... మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సరసన నిలిచే అవకాశం ఉండేది.

కానీ, దక్షిణాఫ్రికా చేతిలో ఓడి శ్రీలంక ఇంటి దారి పట్టింది. దీంతో సంగక్కరకు సచిన్ రికార్డ్స్‌ను బద్దలు కొట్టే అవకాశం రాకుండా పోయింది. దీనికి సచిన్ ఫ్యాన్స్, భారత అభిమానులు దక్షిణాఫ్రికాకు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ ప్రపంచ కప్‌లో సంగక్కర గ్రూప్ దశలో.. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, స్కాట్లాండ్‌ల పైన వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు.

ప్రపంచ కప్‌లలో ఇప్పటి వరకు సచిన్ ఆరు సెంచరీలు చేశాడు. సంగక్కర ఐదు సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సచిన్ రికార్డ్ సమం చేసేవాడు. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటి వరకు సచిన్ పేరిట ఉంది. సచిన్ 6 సెంచరీలు చేశాడు.

WC 2015: Why Sachin should thank South Africa for the win

1996-2011 మధ్య సచిన్ ఆరు సెంచరీలు చేశాడు. సంగక్కర తన కెరీర్‌లో వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు చేసి, ఆస్టేలియా రికీ పాంటింగ్‌ను సమం చేశాడు. సంగక్కర ఐసీసీ వరల్డ్ కప్ 2015లో ఏకంగా 4 సెంచరీలు చేయడం విశేషం. గత వరల్డ్ కప్స్‌లో ఒకటి చేశాడు. మొత్తం 5.

మరోవైపు, దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరడం పైన ట్విట్టర్‌లో పలువురు స్పందించారు. ప్రపంచ కప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తొలిసారి నాకౌట్‌లో గెలిచింది. ఈ విజయంపై పలువురు స్పందించారు. జయవర్ధనే, సంగక్కరే పైన ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్, క్రికెట్ ప్రముఖులు కూడా స్పందించారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+