Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌పై సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన కోహ్లీ: 5 ఓవర్లలో 5వికెట్లు, 27 రన్స్ (పిక్చర్స్)

అడిలైడ్: భారత్ భారీ స్కోరు సాధించడానికి విరాట్ కోహ్లీ (107), శిఖర్ ధావన్ (73), సురేష్ రైనా (74)లు బాగా కృషి చేశారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలార్డర్ అంత బాగా ఆడలేదు. భారత్ 50 ఓవర్లలో 320 పరుగులకు పైగా చేస్తుందని అందరూ భావించారు.

కానీ, చివరి ఐదు ఓవర్లలో పాకిస్తాన్ స్లో బౌలింగ్‌తో దెబ్బతీసింది. దీంతో 300 పరుగులకే భారత్ ఇన్నింగ్స్ ముగించింది. భారత్ మొదటి 45 ఓవర్లలో 273 పరుగులు చేసింది. ఆ తర్వాత అయిదు ఓవర్లలో మాత్రం ఐదు వికెట్లు కోల్పోయి 27 పరుగులు మాత్రమే చేసింది.

భారత్ తరఫున ధావన్, విరాట్ కోహ్లీ, రైనాలు మెరిశారు. ఇటీవల ఫాంలో లేని ధావన్, కోహ్లీలు బాగా ఆడారు. మరోవైపు సురేష్ రైనా డెబ్బై పరుగుల తర్వాత కూడా సెంచరీ కోసం ఆరాటపడకుండా దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. తద్వారా కోహ్లీ పైన ఒత్తిడి లేకుండే చేసే ప్రయత్నం చేసి, అవుటయ్యాడు.

ఇదిలా ఉండగా, గత ప్రపంచకప్ సందర్భంగా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్‌తో జరిగింది. అప్పుడు కోహ్లీ సెంచరీ చేశాడు. ఇప్పుడు కూడా కోహ్లీ సెంచరీ చేశాడు. అప్పుడు మనం కప్ గెలిచాం. ఈ సెంటిమెంట్ ఇప్పుడు కలిసి వస్తుందా చూడాలి. అంతేకాదు, గత ప్రపంచకప్‌లలో పాక్ గెలవకపోవడం, ఇన్ని పరుగులు చేజ్ చేయకపోవడం వంటి సెంటిమెంట్లు కూడా ఉన్నాయి.

విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ పైన సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 2003లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సౌతాఫ్రికాలోని సెంచూరియన్‌లో 98 పరుగులు చేశాడు. ఇప్పుడు కోహ్లీ 126 బంతుల్లో 107 పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లలో పాక్ పైన భారత్ రికార్డ్ బాగా ఉన్నప్పటికీ మనవారు ఇప్పటి వరకు ఎవరు సెంచరీ చేయలేదు. మరోవైపు, ధావన్‌తో కలిసి రికార్డ్ భాగస్వామ్యం నెలకొల్పాడు.

భారత్ - పాక్ మ్యాచ్

భారత్ - పాక్ మ్యాచ్

శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ చేసిన అనంతరం వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందిస్తున్న దృశ్యం. పక్కన పాకిస్తాన్ ప్లేయర్ షాహిద్ అఫ్రీది.

భారత్ - పాక్ మ్యాచ్

భారత్ - పాక్ మ్యాచ్

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ షాట్ కొట్టి అనంతరం, బాల్‌ను చూస్తున్న దృశ్యం.

భారత్ - పాక్ మ్యాచ్

భారత్ - పాక్ మ్యాచ్

అడిలైడ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం సంతోషంలో...

భారత్ - పాక్ మ్యాచ్

భారత్ - పాక్ మ్యాచ్

అడిలైడ్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన అనంతరం సంతోషంలో...

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+