Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క 'పీకే' చూసి జోక్ పేల్చారు, రోహిత్ సండే పని చేయడని ట్విట్టర్‌లో సెటైర్లు

న్యూఢిల్లీ: పాకిస్తాన్ రిజర్వ్ వికెట్ కీపర్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ పైన సహచర క్రికెట్ ఆటగాళ్లు జోకులు వేస్తున్నారట. గత ఆదివారం భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగ్గా... పాక్ ఓటమి చెందింది. భారత్ మ్యాచ్ తర్వాత విశ్రాంతి సమయంలో వారు అమీర్ ఖాన్, కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ నటించిన పీకే చిత్రం చూశారు.

ఈ సమయంలో సహచరులు సర్ఫ్‌‌రాజ్‌ను ఆటపట్టించారట. అడిలైడ్‌లో నువ్వు కీపర్‌గా ఉంటే.. కోహ్లీ క్యాచ్ వదిలివేసి ఉండేవాడివి కాదని అని సహచరులు జోకులు వేశారని అతను చెప్పాడు. దానికి అతను ఈసారి తప్పకుండా ప్రయత్నిస్తానని చెప్పాడు. దీంతో వారు మరింత పగలబడి నవ్వారట. కాగా, అనుష్క ఈ సినిమాలో సర్ఫ్‌రాజ్ అనే పాకిస్తాన్ యువకుడిని పెళ్లి చేసుకుంటుంది.

WC 2015: Record-holding batsman Rohit Sharma mocked on Twitter after scoring a duck

రోహిత్ ఆదివారం పని చేయడు!: ట్విట్టర్‌లో సెటైర్లు

భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ గత ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లోను, నేడు (ఫిబ్రవరి 22)న జరిగిన మ్యాచ్‌లోను విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో అతని పైన భారత అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 20 బంతులు ఆడి 15 పరుగులు చేశాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయకుండానే రనౌట్ అయ్యాడు.

దీంతో ట్విట్టర్‌లో విమర్శలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఆదివారాలు పని చేయడని, అతని కోసమైనా ప్రపంచకప్ మ్యాచులను ఆదివారం నుండి మరో రోజుకు మార్చాలని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రోహిత్ శర్మ నిద్రలో ఉన్నాడని.. ఇలా మండిపడుతూ ఎన్నో ట్వీట్లు వచ్చాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+