బెంగళూరు: ప్రపంచ కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు మరోసారి తలపడే అవకాశాలు లేకపోలేదు. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్, ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ తలపడుతోంది. ఆయా మ్యాచుల్లో భారత్, పాకిస్తాన్ గెలిస్తే... సెమీ ఫైనల్లో భారత్ - పాకిస్తాన్ మధ్య పోరు ఉంటుంది.
కాగా, ఈ నెల 19వ తేదీన జరిగే క్వార్టర్ ఫైనల్లో భారత్ తలపడుతోంది. ఆ తర్వాత ఇరవయ్యే తేదీన పాక్, ఆస్ట్రేలియాలు తలపడున్నాయి. ఈ నేపథ్యంలో పాక్-ఆస్ట్రేలియా గురించి కొన్ని విషయాలు...
ఆస్ట్రేలియా - పాకిస్తాన్ జట్లు ప్రపంచ కప్‌లో ఎనిమిదిసార్లు తలపడ్డాయి. చెరో నాలుగు మ్యాచుల్లో గెలుపొందాయి. ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో 1999 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. 23 ఏళ్ల కింద ఆస్ట్రేలియాను పాకిస్తాన్ ఓడించింది.

1975లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా 73 పరుగుల తేడాతో ఓడించింది. [60 ఓవర్లలో ఆస్ట్రేలియా 278/7, 53 ఓవర్లలో పాకిస్తాన్ 205]
1979లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ 89 పరుగుల తేడాతో ఓడించింది. [60 ఓవర్లలో పాకిస్తాన్ 286/7, 57.1 ఓవర్లలో ఆస్ట్రేలియా 197]
1987లో లాహోర్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా 18 పరుగుల తేడాతో ఓడించింది. [50 ఓవర్లలో ఆస్ట్రేలియా 267/6 , 49.2 ఓవర్లలో పాకిస్తాన్ 249]
1992లో పెర్త్‌లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ 48 పరుగుల తేడాతో ఓడించింది. [50 ఓవర్లలో పాకిస్తాన్ 220/9, 45.2 ఓవర్లలో ఆస్ట్రేలియా 172]
1999లో ఆస్ట్రేలియాను పాకిస్తాన్ 10 పరుగుల తేడాతో ఓడించింది. [50 ఓవర్లలో పాకిస్తాన్ 275/8, 49.5 ఓవర్లలో ఆస్ట్రేలియా 265]
1999లో లార్డ్స్‌లో పాకిస్తాన్‌ను ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో తేడాతో ఓడించింది. [39 ఓవర్లలో పాకిస్తాన్ 132, 20.1 ఓవర్లలో ఆస్ట్రేలియా Aus 133/2]
2003లో జోహన్నస్ బర్గ్‌లో పాకిస్తాన్ పైన ఆస్ట్రేలియా 82 పరుగుల తేడాతో గెలిచింది. [50 ఓవర్లలో ఆస్ట్రేలియా 310/8, 44.3 ఓవర్లలో పాకిస్తాన్ 228]
ఆస్ట్రేలియాను పాకిస్తాన్ నాలుగు వికెట్ల తేడాతో 2011 ప్రపంచ కప్‌లో కొలంబోలో ఓడించింది. [46.4 ఓవర్లలో ఆస్ట్రేలియా 176, 41 ఓవర్లలో పాకిస్తాన్ 178/6]