Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్ ఫైనల్: ఆసీస్ తర్వాత ఆ ఘనతను సాధించిన రెండో దేశంగా కివీస్

సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో దక్షిణ అర్ధగోళంలో ఆస్టేలియా తర్వాత ఫైనల్‌కు అర్హత సాధించిన రెండో దేశంగా న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. మార్చి 24 (మంగళవారం) నాడు ఆక్లాండ్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఈ ఘనతను సాధించింది.

ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో దక్షిణ అర్ధగోళం నుంచి వరల్డ్ కప్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఏకైక దేశం ఆస్టేలియానే. ఆరుసార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌కు అర్హత సాధించిన ఆస్టేలియా నాలుగు సార్లు వరల్డ్ కప్ ఛాంపియన్స్‌గా అవతరించింది.

1975, 1987, 1996, 1999, 2003, 2007లో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్స్‌లో ఫైనల్స్‌ ఆడిన ఆస్టేలియా కేవలం 1975, 1996లో మాత్రమే ఓటమిని చవి చూసింది. ఇక న్యూజిలాండ్ విషయానికి వస్తే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు ఆరు సార్లు అర్హత సాధించింది.

 WC 2015: New Zealand 2nd Southern Hemisphere country to make WC finals

ఈ వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై గెలుపొంది ఫైనల్‌కు చేరుకొంది. అదే విధంగా దక్షిణ అర్ధగోళంలో మిగతా దేశాలైన దక్షిణాఫ్రికా నాలుగు సార్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఐసీసీ వరల్డ్ కప్ క్రికెట్‌లో జింబాబ్వే, నమిబియా దేశాలు ఒక్కసారి కూడా సెమీ పైనల్స్‌కు అర్హత సాధించ లేకపోయాయి.

2003 వరల్డ్ కప్‌లో కెన్యా సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇక ఉత్తర అర్ధ గోళానికి వస్తే వెస్టిండిస్, ఇండియా, పాకిస్దాన్, శ్రీలంక దేశాలు పలుమార్లు వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఆడి ఛాంపియన్స్‌గా నిలిచాయి.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+