వెల్లింగ్టన్: ఐసీసీ వరల్డ్ కప్ 2015లో మార్చి 21న నాల్గవ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆతిథ్య దేశం న్యూజిలాండ్‌తో రెండు సార్లు వరల్డ్ కప్ సాధించిన వెస్టిండిస్ తలపడనుంది. ఇప్పటి వరకు సాగిన టోర్నమెంట్లో అన్ని మ్యాచ్‌లు గెలుచుకుంటూ న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్ధానంలో నిలవగా, వెస్టిండిస్ పసికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీద గెలిచి అతి కష్టం మీద క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు వరల్డ్ కప్‌లో 6 సార్లు తలపడగా, మూడు సార్లు న్యూజిలాండ్, మూడు సార్లు వెస్టిండిస్ గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కోసం వెస్టిండిస్ తహతహలాడుతోంది. అయితే, వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ ఫిట్ నెస్‌పై స్పష్టత రాలేదు.
వీపు నొప్పి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో మార్చి 15న నేపియర్‌లో జరిగిన మ్యాచ్‌కి క్రిస్ గేల్ దూరమైన విషయం తెలిసిందే. క్రిస్ గేల్ కోలుకొని న్యూజిలాండ్‌తో క్వార్టర్ ఫైనల్స్‌లో జరిగే మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని విండిస్ శిబిరం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఇక వెస్టిండిస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ మాట్లాడుతూ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కి ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. పూర్తిగా కోలుకున్న తర్వాతే గేల్ బరిలోకి దిగుతాడని పేర్కొన్నాడు. మార్చి 21న న్యూజిలాండ్ Vs వెస్టిండిస్ మ్యాచ్ వెల్లింగ్టన్‌లో జరగనుంది.

గత వరల్డ్ కప్స్‌లో న్యూజిలాండ్ Vs వెస్టిండిస్ మ్యాచ్ ఫలితాలు:
* 1975 వరల్డ్ కప్: లండన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో వెస్టిండిస్ గెలుపొందింది.
1979 వరల్డ్ కప్: నాటింగ్ హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 32 పరుగుల తేడాతో వెస్టిండిస్ గెలుపొందింది.
1992 వరల్డ్ కప్: ఆక్లాండ్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై 5 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది.
1999 వరల్డ్ కప్: సౌతాంప్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో వెస్టిండిస్ గెలుపొందింది.
2003 వరల్డ్ కప్: పోర్ట్ ఎలిజిబెత్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై న్యూజిలాండ్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది.
2007 వరల్డ్ కప్: నార్త్ సౌండ్‌లో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.