ఎలా?: 'కీలక మ్యాచ్‌లలో ధోనీ కెప్టెన్సీలో గెలుపు ఓ మిస్టరీనే'
హోమిల్టన్: ప్రపంచ కప్ లేదా ఇతర ముఖ్యమైన టోర్నీలలో మహేంద్ర సింగ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు బాగా రాణించడం మిస్టరీ అని మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మంగళవారం అన్నాడు. ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ విజయాలతో దూసుకుపోతోంది. భారత్ తాను ఆడిన ఐదు మ్యాచులలో విజయం సాధించింది. శుక్రవారం జింబాబ్వేతో పోరుకు సిద్ధమైంది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరుగుతున్న వరుస ఐదు విజయాల ద్వారా ధోనీ సేన కొత్త రికార్డ్ సృష్టించింది. ప్రపంచ కప్‌లో వరుసగా తొమ్మిది మ్యాచులు నెగ్గిన రికార్డ్ నెలకొల్పింది. ఈ నేపథ్యంలో గంగూలీ మాట్లాడాడు. గంగూలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రపంచ కప్‌లో ధోనీ సేన అద్భుత ప్రదర్శన కనబరుస్తోందన్నాడు. ధోనీ కూడా వ్యక్తిగతంగా అద్భుత ప్రదర్శన ఇస్తున్నాడన్నాడు.
ఐర్లాండ్ పైన గెలవడం ద్వారా ధోనీ సేన ఎన్నో రికార్డ్‌లు సృష్టించింది. మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉన్న రికార్డును కెప్టెన్ ధోనీ బద్దలుకొట్టినట్లయింది. ప్రపంచ కప్ టోర్నీలో భారత్ తన విజయాల రేటును పెంచుకుంది. ఇది టీమిండియాకు వరుసగా ఐదో విజయం. ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ పేరిట ఉన్న రికార్డును టీమిండియా సమం చేసింది. మంగళవారం మ్యాచులో విజయం ప్రపంచ కప్ టోర్నీలో భారత్ పేరిట విజయాలను పెంచేసింది.

భారత క్రికెట్ జట్టు
ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 9 విజయాలను నమోదు చేసిన టీమిండియా.. 1975, 1979లలో వరుసగా వరుస 9 విజయాలను సాధించిన వెస్టిండీస్(ఈ రెండుసార్లు కప్ విండీస్‌దే) రికార్డును సమం చేసింది. 2003 ప్రపంచ కప్ టోర్నీలో గంగూలీ నాయకత్వంలోని టీమిండియా వరుసగా 8 విజయాలు నమోదు చేసింది.

భారత క్రికెట్ జట్టు
ప్రపంచ కప్ టోర్నీల్లో కపిల్ నాయకత్వంలో 11 విజయాలను అందుకున్న టీమిండియా, ధోనీ నేతృత్వంలో 12 విజయాలను నమోదు చేసింది. ప్రపంచ కప్ టోర్నీల్లో శిఖర్ ధావన్-రోహిత్ శర్మల భాగస్వామ్యం మరో రికార్డును నమోదు చేసింది. 1996లో సచిన్ టెండూల్కర్-అజయ్ జడేజాలు చేసిన 163 పరుగుల భాగస్వామ్యాన్ని 174 పరుగులు చేసిన రోహిత్-శిఖర్ బ్రేక్ చేశారు.

భారత క్రికెట్ జట్టు
భారత్‌కు ప్రపంచ కప్ అందించింది కపిల్, ఆ తర్వాత ధోనీనే. 1983లో కపిల్, 2011లో ధోనీ నేతృత్వంలో టీమిండియా ప్రపంచ కప్ అందుకుంది. 2011 ప్రపంచ కప్ టోర్నీలో మార్చి 20న వెస్టిండీస్ జట్టును ఓడించడంతో టీమిండియా 9 వరుస విజయాలను సాధించింది.

భారత క్రికెట్ జట్టు
2011 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 4 విజాయలను అందుకుంది. 2011 ప్రపంచ కప్ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ మాత్రమే ఓడిపోయింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా, 2015 ప్రపంచ కప్ టోర్నీలో వరుసగా 5 మ్యాచులు గెలుపొందింది(పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వెస్టిండీస్, ఐర్లాండ్)

భారత క్రికెట్ జట్టు
కాగా, ధోనీ సేన తిరుగులేని విజయాలతో దూసుకుపోతోంది. ఈ ప్రపంచ కప్‌లో ఆడిన ఐదు మ్యాచులలో ఐదు జట్లను ఆలౌట్ చేసింది. ఇలా చేయడం మన జట్టుకు ఇదే తొలిసారి. గ్రూప్ ఏలో న్యూజిలాండ్ కూడా 5 మ్యాచులలోను ప్రత్యర్థులను ఆలౌట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications