Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్ 3 వికెట్లు కోల్పోయిన ఆనందం, ప్రధాని జోస్యం ఫలించలేదు

ఢాకా: ప్రపంచ కప్‌లో భాగంగా భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో తాము గెలుస్తామని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అభిప్రాయపడ్డారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. 115 పరుగుల వద్ద 28 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ఆనందం వ్యక్తం చేశారు.

సమాచారం మేరకు ఓ కార్యక్రమంలో ఉన్న షేక్ హసీనా బంగ్లాదేశ్ - భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ గురించి మాట్లాడారు. భారత్ మూడో వికెట్ కోల్పోయిన తర్వాత 'ఇన్షా అల్లా, మేం గెలుస్తాం' అంటూ చెప్పారని విలేకరులు చెబుతున్నారు.

WC 2015: Inshallah we will win, said Bangladeshi PM after India lost 3 wickets

భారత జట్టు పైన బంగ్లాదేశ్ గెలిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. లీగ్ దశలో ఇంగ్లాండ్ పైన మంచి ప్రదర్శన చేశారని చెప్పారు. బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ పైన 15 పరుగుల తేడాతో గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. కాగా, ప్రపంచ కప్ కోసం వెళ్లే ముందు బంగ్లాదేశ్ క్రికెటర్లు షేక్ హసీనాను కలిశారు. వారు జనవరి 21వ తేదీన ఆమెను కలిశారు. కాగా, క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ పైన భారత్ గెలిచింది. దీంతో బంగ్లాదేశ్ గెలుస్తుందన్న ఆ దేశ ప్రధాని జోస్యం ఫలించలేదనే చెప్పవచ్చు.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+