For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: ఆతిథ్య దేశాలపై గెలుపు, భారత్‌కు చరిత్ర సృష్టించే సదావకాశం

By Nageswara Rao

సిడ్నీ: ఢిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియా రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మార్చి 26(గురువారం)న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్టేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే పైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో ఆడాల్సి ఉంది.

ఆక్లాండ్‌లో జరిగిన తొలి సెమీ ఫైనల్ ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధోని సేన గనుకు ఆస్టేలియాను ఓడించి, ఫైనల్ లో కూడా గెలిస్తే అదొక పెద్ద సంచలనమే అవుతుంది. అందుకు కారణం ఆస్టేలియా, న్యూజిలాండ్‌లు ఈ ఏడాది వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాలు.

ఈ రెండు దేశాలపై విజయం సాధించి ఫైనల్‌లో విజేతగా టీమిండియా గెలిస్తే మూడోసారి వరల్డ్ కప్‌ను సాధించిన రెండో దేశంగా అవతరిస్తుంది. ఇప్పటి వరకు వరల్డ్ కప్‌ను మూడు సార్లు గెలుచుకున్న దేశంగా ఆస్టేలియా ఉంది.

వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాలను ఓడించి వరల్డ్ కప్‌ను సొంతం చేసుకున్న దేశం ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. ఈ అవకాశం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. సెమీ ఫైనల్‌లో ఆస్టేలియాను ఓడించి, పైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించగలిగితే ఆతిథ్య దేశాలపై గెలిచిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది.

WC 2015:India will have to beat both hosts to win 3rd title

గతంలో జరిగిన వరల్డ్ కప్‌లను పరిశీలిస్తే:

1975: వెస్టిండిస్ వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్(న్యూజిలాండ్), పైనల్స్ (ఆస్టేలియా)- ఇంగ్లాండ్‌లో జరిగింది.

1979: వెస్టిండిస్ వరల్డ్ కప్ గెలిచింది - సెమీ ఫైనల్స్ (పాకిస్ధాన్), పైనల్స్ (ఇంగ్లాండ్) - ఇంగ్లాండ్‌లో జరిగింది.

1983: భారత్ వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (ఇంగ్లాండ్), పైనల్స్ (వెస్టిండిస్)- ఇంగ్లాండ్‌లో జరిగింది.

1987: ఆస్టేలియా వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (పాకిస్ధాన్), పైనల్స్ (ఇంగ్లాండ్)- ఇండియా, పాకిస్దాన్‌లో జరిగింది.

1992: పాకిస్ధాన్ వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (న్యూజిలాండ్), పైనల్స్ (ఇంగ్లాండ్) - ఆస్టేలియా, న్యూజిలాండ్‌లో జరిగింది.

1996: శ్రీలంక వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (ఇండియా), పైనల్స్ (ఆస్టేలియా) - పాకిస్ధాన్, ఇండియా, శ్రీలంక

1999: ఆస్టేలియా వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (దక్షిణాఫ్రికా), పైనల్స్ (పాకిస్ధాన్) - ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ & నెదర్లాండ్స్

2003: ఆస్టేలియా వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (శ్రీలంక), పైనల్స్ (ఇండియా) - దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా

2007: ఆస్టేలియా వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (దక్షిణాప్రికా), పైనల్స్ (శ్రీలంక) - వెస్టిండిస్

2011: భారత్ వరల్డ్ కప్ గెలిచింది - సెమీ పైనల్స్ (పాకిస్ధాన్), పైనల్స్ (శ్రీలంక) - భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+