సిడ్నీ: ఐసీసీ వరల్డ్ కప్ 2015లో డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా, సెమీ ఫైనల్స్‌లో మాజీ ఛాంపియన్స్ ఆస్టేలియాతో మార్చి 26న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తలపడనుంది. మెల్ బోర్న్‌లో బంగ్లాపై జరిగిన మ్యాచ్‌లో భారత్ 109 పరుగుల తేడాతో విజయం సాధించగా, అడిలైడ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లో ఆస్టేలియా, భారత్‌లు 10 సార్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు ఆస్టేలియా గెలుపొందుగా, 3 సార్లు మాత్రమే భారత్ గెలుపొందింది. ఆస్టేలియా గెలుపొందిన 7 సార్లలో రెండు సార్లు ఒక పరుగు తేడాతో ఆస్టేలియా గెలుపొందిన సందర్భం ఉంది.
2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్టేలియా భారత్‌లు తలపడగా, ఆ మ్యాచ్‌లో భారత్‌పై ఆస్టేలియా 123 పరుగుల తేడాతో విజయం సాధించి, వరల్డ్ కప్ ఛాంపియన్స్‌గా అవతరించింది. అయితే ఆస్టేలియాపై కెప్టెన్ ధోనికి మాత్రం వంద శాతం విజయాల రికార్డు ఉంది. ముఖ్యంగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో అహ్మాదాబాద్‌లో ఆస్టేలియాపై జరిగిన మ్యాచ్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

* 1983లో నాటింగ్ హామ్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ 162 పరుగుల తేడాతో విజయం సాధించింది [Aus 320/9 in 60 overs, India 158 in 37.5 overs]
* 1983లో చెల్మస్‌ఫోర్డ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 118 పరుగుల తేడాతో విజయం సాధించింది [India 247 in 55.5 overs, Aus 129 in 38.2 overs]
* 1987లో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది [Aus 270/6 in 50 overs, India 269 in 49.5 overs]
* 1987లో ఢిల్లీలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించింది [India 289/6 in 50 overs, Aus 233 in 49 overs]
* 1992లో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది [Aus 237/9 in 50 overs, India 234 in 47 overs (target was revised to 236 in 47 overs)]
* 1996లో ముంబైలో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది [Aus 258 in 50 overs, India 242 in 48 overs]
* 1999లో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది [Aus 282/6 in 50 overs, India 205 in 48.2 overs]
* 2003లో సెంచూరియన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది [India 125 in 41.4 overs, Australia 128/1 in 22.2 overs]
* 2003లో జోహెన్స్ బర్గ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది [Aus 359/2 in 50 overs, India 234 in 39.1 overs]
* 2011లో అహ్మాదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్ 77 పరుగుల తేడాతో విజయం సాధించింది [Aus 260/5 in 50 overs, India 261/5 in 47.4 overs]