కాన్‌బెర్రా: ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం నాడు జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్ పలు రికార్డులు నెలకొల్పాడు. 138 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు. తద్వారా పలు రికార్డులు బద్దలు కొట్టాడు. వన్డేల్లో ఇప్పటి వరకు ఐదు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి.
అందులో భారతీయులవే నాలుగు ఉన్నాయి. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడు క్రిస్ గేల్. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో గేల్ 138 బంతుల్లో 16 సిక్స్‌లు, 9 ఫోర్లతో ద్విశతకం బాదాడు. గతంలో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్ తదితరులు డబుల్ సెంచరీలు చేశారు. అయితే, తక్కువ బాల్స్‌లో డబుల్ చేసిన ఘనత గేల్‌దే.

డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడిగా గేల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా, ప్రపంచకప్‌లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడు గేల్. ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డ్ ఇప్పటి వరకు కిర్‌స్టన్ పేరిట ఉంది. అతను 188 పరుగులు చేశాడు. ఇప్పుడు గేల్ డబుల్ దాటాడు. 1996లో యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పైన కిర్‌స్టన్ 188 పరుగులు చేశాడు.
రాహుల్ ద్రావిడ్ - సౌరవ్ గంగూలీల భాగస్వామ్య రికార్డును గేల్ - శామ్యూల్ భాగస్వామ్యం బద్దలు చేసింది. అలాగే వెస్టిండీస్ గ్రేట్ వివియన్ రిచర్డ్స్ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తరఫున రిచర్డ్స్ అత్యధిక పరుగుల జాబితాలో ఉన్నాడు. 1987లో శ్రీలంక పైన కరాచీలో రిచర్డ్స్ ఆ రికార్డ్ సృష్టించాడు. ఇప్పుడు గేల్ దాన్ని దాటాడు.
జింబాబ్వేతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో గేల్ 147 బంతుల్లో 10 ఫోర్లు, 16 సిక్స్‌లతో 215 పరుగులు చేశాడు. శామ్యూల్ 156 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. వీరి భాగస్వామ్యం.. 320 పరుగులు దాటింది.
క్రిస్ గేల్ రికార్డ్స్
40 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో మొదటి డబుల్ సెంచరీ క్రిస్ గేల్ (147 బంతుల్లో 215 పరుగులు)
ఈ మ్యాచ్‌లో క్రిస్ గేల్ స్ట్రైక్ రేటు 146.25.
వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ గేల్‌ది. గతంలో వీరేంద్ర సెహ్వాగ్ 140 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.
వన్డేల్లో సచిన్ టెండుల్కర్ తొలి డబుల్ సెంచరీ చేశాడు. 2010లో సౌతాఫ్రికా పైన గ్వాలియర్‌లో చేశాడు.
టీ20లో సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ, టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్ గేల్.
గేల్‌ది ప్రపంచకప్‌లో హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోర్.
గేల్‌ది వెస్టిండీస్ తరఫున ప్రపంచకప్‌లో హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోర్.
గేల్‌ది వన్డే చరిత్రలో మూడో హయ్యెస్ట్ వ్యక్తిగత స్కోర్.
డబుల్ సెంచరీ చేసిన తొలి భారతీయేతరుడు.
వన్డేల్లో ఇది అయిదో డబుల్ సెంచరీ.
16 సిక్స్‌లు.. రోహిత్ శర్మ, డివిల్లియర్స్‌తో సమానంగా గేల్ ఉన్నాడు.
400 సిక్స్‌లు... అంతర్జాతీయ క్రికెట్లో 400 సిక్స్‌లు కొట్టిన రెండో క్రికెటర్. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రీది 447 సిక్స్‌లు కొట్టాడు.
49.4 ఓవర్లలో 372 పరుగులు 2 వికెట్లు... ఇది వన్డే చరిత్రలో హయ్యెస్ట్ భాగస్వామ్యం.
50 ఓవర్లలో 372/2.. వన్డేలలో వెస్టిండీస్‌కు ఇది అత్యధిక స్కోర్. 2014లో జింబాబ్వే పైన 363/4.