Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్: మరో ఘనత సాధించిన ఆస్టేలియా, 6వ దేశంగా...!

అడిలైడ్: ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్‌లో ఆస్టేలియా, పాకిస్ధాన్‌పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించి, వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాల్లో సెమీ ఫైనల్‌కు చేరిన 6వ దేశంగా రికార్డుని సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్‌లో ఆసియా దేశాల నుంచి ఒక్క భారతే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించడం విశేషం.

గురువారం రెండో క్వార్టర్ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌పై 109 పరుగుల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. 1975 నుంచి ఇప్పటి వరకు వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాల్లో ఇంగ్లాండ్, ఇండియా, పాకిస్ధాన్, శ్రీలంక, న్యూజిలాండ్‌లు ఉన్నాయి. అలెన్ బోర్డర్ కెప్టెన్సీలో 1992 వరల్డ్ కప్‌లో ఆస్టేలియా సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

WC 2015: Australia become 6th host nation to qualify for WC semis

ఐతే ఇప్పటి వరకు వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశాల్లో సెమీ ఫైనల్‌కు అర్హత సాధించిన దేశాలు కూడా ఉన్నాయి. స్కాట్లాండ్ (1999), దక్షిణాఫ్రికా (2003), జింబాబ్వే (2003), కెన్యా (2003), వెస్టిండిస్ (2007), బంగ్లాదేశ్ (2011)లో వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్‌కు రాలేదు.

మార్చి 26న జరిగే రెండో సెమీ పైనల్స్‌లో భారత్, ఆస్టేలియా ఆడనున్నాయి. ఈ మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఇప్పటి వరకు జరిగిన వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లో ఆస్టేలియా, భారత్‌లు 10 సార్లు తలపడ్డాయి. అందులో 7 సార్లు ఆస్టేలియా గెలుపొందుగా, 3 సార్లు మాత్రమే భారత్ గెలుపొందింది. ఆస్టేలియా గెలుపొందిన 7 సార్లులో రెండు సార్లు ఒక పరుగు తేడాతో ఆస్టేలియా విజయం సాధించింది.

వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చి సెమీస్‌కు చేరిన దేశాలు:

* ఇంగ్లాండ్ (1975, 1979, 1983)
* ఇండియా (1987, 1996)
* పాకిస్ధాన్ (1987)
* శ్రీలంక (1996)
* న్యూజిలాండ్ (1992)

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+