For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐర్లాండ్‌పై భారత్ విజయం: ధావన్ సెంచరీ, వరుసగా 9వ విజయాన్ని నమోదు చేసిన ధోని సేన

By Nageswara Rao

హామిల్టన్: ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బిలో భాగంగా భారత్, ఐర్లాండ్‌ మధ్య హామిల్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో 8వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. 36.5 ఓవర్లలో 260 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా చేధించింది. వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇది ఐదవ విజయం. ఈ విజయంతో వరల్డ్ కప్‌లో ధోనిసేన వరుసగా తొమ్మిదవ విజయాన్ని నమోదు చేసింది.

మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 84 బంతుల్లో సెంచరీ సాధించి, టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధావన్ ఔటైన అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లీ 44, అజ్యంకే రహానే 33 పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో థామ్సన్ 2 వికెట్లను తీసుకున్నారు.

శిఖర్ ధావన్ సెంచరీ:

ఐసీసీ వరల్డ్ కప్‌లో పూల్ బిలో భాగంగా భారత్, ఐర్లాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 84 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ వరల్డ్ కప్‌లో ధావన్‌కు ఇది రెండో సెంచరీ. భారత్ 190 పరుగుల వద్ద ధావన్ ఔట్ అవడంతో రెండో వికెట్‌ను కోల్పోయింది. సరిగ్గా 100 పరుగుల వద్ద ధావన్ ఔట్ అవడం విశేషం.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా:

24 ఓవర్‌లో రెండో బంతికి 174 పరుగుల వద్ద టీమిండియా రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్‌ను కొల్పోయింది. దీంతో రోహిత్ శర్మ 64 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు వెనుదిరిగాడు.

రోహిత్ శర్మ అర్ధ సెంచరీ:

49 బంతుల్లో రోహిత్ శర్మ అర్ధ సెంచరీ సాధించాడు. 19 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 134 పరుగులు చేసింది.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

శిఖర్ ధావన్ అర్ధ సెంచరీ:

* భారత్, ఐర్లాండ్‌ మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 54 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో అర్ధ సెంచరీ సాధించాడు. వన్డేల్లో అతడికిది 13వ అర్ధసెంచరీ. రోహిత్ శర్మ(46) అర్ధ సెంచరీకి చేరువలో ఉన్నాడు. వీరిద్దరూ 90 బంతుల్లో 100 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు.

* 15 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా వికెట్లు కోల్పోకుండానే 103 పరుగులతో కొనసాగుతుంది.

4వేల పరుగుల మైలురాయిని దాటిన రోహిత్ శర్మ:

డాక్రెల్‌ వేసిన బంతిని రోహిత్‌ శర్మ సిక్సర్‌‌కు తరలించాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకి ఇది రెండో సిక్స్‌. ఈ సిక్స్‌తో రోహిత్‌ శర్మ వన్డేల్లో 4000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. 4000 పరుగులు దాటిన భారత 14వ బ్యాట్స్‌మెన్‌ రోహిత్‌ శర్మ.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

శిఖర్ ధావన్‌కు రెండో లైఫ్:

* మూనీ వేసిన బంతిని స్క్వేర్‌ లెగ్‌లోంచి బౌండరీకి తరలించే సందర్భంలో కట్‌ చేసిన ధావన్‌.. అక్కడ ఉన్న ఫీల్డర్‌ డైవ్‌ చేస్తూ క్యాచ్‌ పట్టినా బంతి చెతుల్లోంచి జారిపోవడంతో మరోసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

* 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 10, రోహిత్ 11 శర్మ పరుగులతో ఆడుతున్నారు.

* బ్యాటింగ్‌ను ఆరంభించిన టీమిండియా నాలుగు ఓవర్లు ముగిసే సరికి 16 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ(10), శిఖర్‌దావన్(6) పరుగులతో కొనసాగుతున్నారు.

* ఐర్లాండ్ నిర్దేశించిన 260 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా బరిలోకి దిగింది. ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఆరంభించారు.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

భారత్‌ విజయ లక్ష్యం 260 పరుగులు:

* ఐర్లాండ్ 49 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌ విజయ లక్ష్యం 260 పరుగులు. ఐర్లాండ్‌లో నీల్ ఓబ్రైన్ అత్యధికంగా 75 పరుగులు చేయగా, విలియం ఫోర్టర్ ఫీల్డ్ 67 పరుగులు చేశారు. పౌల్ స్టిర్లింగ్ 42 పరుగులు చేసి అర్ధ సెంచరీని చేజార్చుకున్నారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీసుకోగా, అశ్విన్ 2, ఉమేష్ యాదవ్, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, సురేష్ రైనా తలో వికెట్ తీసుకున్నారు.

* ఐర్లాండ్ తన తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది. జార్జ్ డాక్కెల్-6 పరుగులు చేసి ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్‌ఇచ్చి ఔటయ్యాడు. 46 ఓవర్లకుగాను తొమ్మిది వికెట్ల నష్టానికి 244 పరుగులతో ఉంది.

* ఐర్లాండ్ ఎనిమిది వికెట్లు కోల్పోయింది. గ్యారీ విల్సన్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

* ఆ వెంటనే బ్యాటింగ్‌కు వచ్చిన స్టువార్ట్ థాంప్సన్ 2 పరుగులు చేసి రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

* భారత బౌలర్లను ఎదుర్కొంటూ నిలకడగా ఆడుతున్న నీల్ ఓబ్రైన్ 75 పరుగులు చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మిడిల్‌ స్టంప్‌నుంచి ఆఫ్‌ స్టంపై వైపు స్వింగ్‌ అవుతూ వెళుతున్న బంతిని ఆడే ప్రయత్నంలో కెవిన్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.

* అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కెవిన్ ఓబ్రైన్ 1 పరుగు మాత్రమే చేసి మహ్మద్ షమీ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. ఐర్లాండ్ ప్రస్తుత స్కోర్ 40 ఓవర్లకుగాను ఐదువికెట్లు నష్టానికి 212 పరుగులతో కొనసాగుతుంది.

* అశ్విన్‌ వేసిన బంతిని స్వీప్‌ ద్వారా బౌండరీ సాధించాలన్న ప్రయత్నంలోబ్యాట్‌ ఎడ్జ్‌కి తీసుకున్న బంతి షార్ట్‌ఫైన్‌ లెగ్‌లో ఉన్న షమీకి క్యాచ్‌ ఇచ్చి బాల్‌ బిర్నీ వెనుదిరిగాడు. దీంతో ఐర్లాండ్ తన ఐదవ వికెట్‌ను కోల్పోయింది.

* అశ్విన్‌ ఈ ఓవర్‌తో తన 10 ఓవర్‌ల కోటా పూర్తి చేశాడు. పదో ఓవర్‌ ఆఖరి బంతికి వికెట్‌ తీయటం ద్వారా తన కోటా పది ఓవర్లలో రెండు వికెట్లు తీసి 38 పరుగులు ఇచ్చాడు.

* 39 ఓవర్లకు గాను ఐర్లాండ్ 4 వికెట్లు కొల్పోయి 206 పరుగులు చేసింది.

* 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బాల్బిరైన్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఐర్లాండ్ 4వ వికెట్‌ను కోల్పోయింది.

* 35 ఓవర్లు పూర్తయ్యే సరికే ఐర్లాండ్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.

WC 2015: After a good start, Ireland lose 3 quick wickets

రైనా స్థానంలో రోహిత్‌ శర్మ బౌలింగ్:

* రైనా స్థానంలో కెప్టెన్ ధోని మరో స్పిన్నర్‌ రోహిత్‌ శర్మని రంగంలోకి దించాడు. అప్పుడప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ చేసే రోహిత్‌ శర్మ.. అంత ప్రమాదకరమైన బౌలర్‌ ఏమీ కాదు. ఇప్పటి వరకూ తాను ఆడిన 132 వన్డేల్లో రోహిత్‌ 8 వికెట్లు మాత్రమే తీశాడు.

పోర్టర్‌ఫీల్డ్‌ అర్ధ సెంచరీ:

* పోర్టర్‌ఫీల్డ్‌ 66 బంతుల్లో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 66 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికి ఇది 11వ అర్ధ సెంచరీ. ఇప్పటి వరకూ ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసిన అశ్విన్‌ 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీయటం

* స్టిర్లింగ్ క్యాచ్‌ఔట్ అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఎడ్ జాయ్స్ రెండు పరుగులు చేసి రైనా బౌలింగ్‌లో బోల్డ్ అవ్వడంతో ఐర్లాండ్ రెండో వికెట్‌ను కోల్పోయింది.

* భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. స్టిర్లింగ్-42 (4 ఫోర్లు, 2 సిక్స్) పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

* భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఐర్లాండ్ ఇప్పటివరకు (10 ఓవర్లకుగాను) వికెట్లేమి కోల్పోకుండానే 60 పరుగులతో దాటిగా బ్యాటింగ్‌ను కొనసాగిస్తుంది. పోర్టర్‌ఫీల్డ్-30 (3 ఫోర్లు, ఒక సిక్స్), స్టిర్లింగ్-25 (4 ఫోర్లు, ఒక సిక్స్) తో ప్రస్తుతం క్రీజులో కొనసాగుతున్నారు.

* తొలుత టాస్ గెలిచిన ఐర్లాండ్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది.

భారత్:
శిఖర్‌ధావన్, రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లి, అజింక్య రహానే, సురేశ్‌రైనా, ధోని, రవీంద్ర జడేజా, రవిచంద్రన్, అశ్విన్, మహ్మద్ షమీ, ఉమేష్‌యాదవ్, మోహిత్‌శర్మ.

ఐర్లాండ్:
పోర్టర్‌ఫీల్డ్, స్టిర్లింగ్, ఎడ్ జాయ్స్, బాల్‌బిర్నీ, నీల్ ఓబ్రైన్, గ్యారీ విల్సన్, కెవిన్ ఓబ్రైన్, జాన్ మూనీ, జార్జ్ డాక్కెల్, అలెక్స్ కుసాక్, స్టువార్ట్ థాంప్సన్.

Story first published: Monday, November 13, 2017, 12:11 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+