మెల్బోర్న్: ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఫైనల్ పోరు సాగుతోంది. కివీస్ ఎలియోట్ 83 పరుగులు చేసి సెంచరీకి పదమూడు పరుగుల దూరంలో అవుటయ్యాడు. కివీస్ తరఫున ఎవరు సెంచరీ చేయలేదు. కివీస్ 184 స్వల్ప లక్ష్యాన్ని ఆసిస్ ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో ఆసిస్ తరఫున సెంచరీ చేస్తారా లేదా అన్నది చూడాలి.
కాగా, ప్రపంచ కప్ ఫైనల్స్‌లలో ఇప్పటి వరకు ఆరుగురు సెంచరీ చేశారు. వారిలో...
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్) - 157 బంతుల్లో 138 పరుగులు నాటౌట్ - 1979లో ఇంగ్లాండ్ పైన - వెస్టిండిస్ గెలుపు
అరవింద్ డిసిల్వా (శ్రీలంక) - 124 బంతుల్లో 107 పరుగులు నాటౌట్ - 1996లో ఆస్ట్రేలియా పైన - శ్రీలంక గెలుపు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 121 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ - 2003లో భారత్ పైన - ఆస్ట్రేలియా గెలుపు
అడమ్ గిల్ క్రిస్ట్ ( ఆస్ట్రేలియా) - 104 బంతుల్లో 149 పరుగులు - 2007లో శ్రీలంక పైన - శ్రీలంక గెలుపు
మహేల జయవర్ధనే - 88 బంతుల్లో 103 పరుగులు నాటౌట్ - 2011లో భారత్ పైన - భారత్ గెలుపు

మైకేల్ క్లార్క్ 19వ ఆటగాడు
ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాకు సారథ్యం వహించిన 19వ సారథిగా మైకేల్ క్లార్క్ రికార్డ్ సృష్టించాడు. న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మొదటిసారి ఫైనల్లో సారథ్యం వహిస్తున్నాడు. గత ప్రపంచ కప్ వరకు ఫైనల్లో సారథ్యం వహించిన వారిలో 17 మంది ఉన్నారు. వారు...

రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా 2003, 2007) గెలుపు
కపిల్ దేవ్ ( భారత్ 1983) గెలుపు
అలెన్ బోర్డర్ (ఆస్ట్రేలియా 1987) గెలుపు
ఇమ్రాన్ ఖాన్ (పాకిస్తాన్ 1992) గెలుపు
రణతుంగ (శ్రీలంక 1996) గెలుపు
స్టీవ్ వా (ఆస్ట్రేలియా 1999) గెలుపు
ఎమ్మెస్ ధోనీ (భారత్ 2011) గెలుపు
ఇయాన్ చాపెల్ (ఆస్ట్రేలియా 1975) ఓటమి
మైక్ బ్రేర్లీ (ఇంగ్లాండ్ 1979) ఓటమి
మైక్ గ్యాటింగ్ (ఇంగ్లాండ్ 1987) ఓటమి
గ్రహమ్ గూచ్ (ఇంగ్లాండ్ 1992) ఓటమి
మార్క్ టేలర్ (ఆస్ట్రేలియా 1996) ఓటమి
వసీమ్ అక్రమ్ (పాకిస్తాన్ 1999) ఓటమి
సౌరవ్ గంగూలీ (భారత్ 2003) ఓటమి
జయవర్ధనే (శ్రీలంక 2007) ఓటమి
కుమార సంగక్కర (2011 శ్రీలంక)