'డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని ఆర్చర్ బౌలింగ్‌ చూడటం చాలా భయంగా ఉంటుంది'

హైదరాబాద్: మైదానంలో జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌ని ఎదుర్కోవడమే మంచిదని.. డ్రెస్సింగ్‌లో రూమ్‌లో కూర్చొని అతడి బౌలింగ్‌ చూడటం చాలా భయంగా ఉంటుందని తొలి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌, ఆసీస్ ఆల్‌రౌండర్‌ మార్నస్‌ లాబుస్చాగ్నే తెలిపాడు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 19 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన లాబుస్చాగ్నే హాఫ్ సెంచరీతో రాణించాడు.

అయితే, క్రీజులోకి వచ్చిన వెంటనే జోప్రా ఆర్చర్ బౌలింగ్‌లో అతడు ఎదుర్కొన్న రెండో బంతికే గాయపడ్డాడు. హెల్మెట్‌కు బంతి బలంగా తాకినా పట్టుదలగా బ్యాటింగ్‌ చేసి హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు ఆస్ట్రేలియాను ఓటమి నుంచి తప్పించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరిస్‌లో ఆసీస్ ఆధిక్యం 1-0గా ఉండటంలో కీలకపాత్ర పోషించాడు.

టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ ఎవరో తెలుసా?

ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడినప్పుడు

ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడినప్పుడు

మ్యాచ్ అనంతరం మార్నస్‌ లాబుస్చాగ్నే మాట్లాడుతూ "ఆర్చర్‌ బౌలింగ్‌లో స్మిత్‌ గాయపడినప్పుడు కాస్త కంగారు పడ్డా. అలాంటి సమయంలో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఆటలో భాగమై మైదానంలో అడుగుపెట్టాక శరీరంలో ఒకరకమైన ఆందోళన మొదలైనప్పుడు ఆ బంతిని చూడటమే తప్ప చేసేదేమీ ఉండదు" అని అన్నాడు.

నా హెల్మెట్‌కు బలంగా తాకింది.

నా హెల్మెట్‌కు బలంగా తాకింది.

"ఆర్చర్‌ వేసిన రెండో బంతి నా హెల్మెట్‌కు బలంగా తాకింది. అనంతరం కుదురుకొని ఏమీ కానట్టు ఆటను కొనసాగించాలి. మొదటి బంతుల్లోనే ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనడం వల్ల ఉపయోగమదే. అలాంటి క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనేందుకు మేమంతా ముందే సిద్ధపడ్డాం. ఆర్చర్‌ కొన్నిసార్లు చాలా మంచి బౌలింగ్‌ చేశాడు. తన పదునైన బౌలింగ్‌తో మా బ్యాట్స్‌మెన్‌కు పరీక్ష పెట్టాడు" అని మార్నస్‌ లాబుస్చాగ్నే అన్నాడు.

92 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఔట్

92 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఔట్

ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో భాగంగా లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్‌ వేసిన బంతి ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ మెడను బలంగా తాకడంతో రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. అనతంరం 40 నిమిషాల తర్వాత తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. అయితే గాయం తీవ్రత దృష్ట్యా స్టీవ్ స్మిత్ రెండో టెస్టు నుంచి తప్పుకున్నాడు.

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లాబుస్చాగ్నే

కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లాబుస్చాగ్నే

ఒక క్రికెటర్‌ తలకు బంతి తగిలి ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయినప్పుడు వచ్చే సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తూ ఐసీసీ సవరణ చేసింది. ఐసీసీ ఈ కొత్త నిబంధనల మేరకు ఆస్ట్రేలియా సబ్‌స్టిట్యూట్ కావాలని రిఫరీని సంప్రదించగా అందుకు మ్యాచ్ రిఫరీ అంగీకరించాడు. స్మిత్ స్మిత్ స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ మార్నస్ లాబుస్చాగ్నే మైదానంలో అడుగుపెట్టాడు.

మార్నస్ లాబుస్చాగ్నే అరుదైన ఘనత

మార్నస్ లాబుస్చాగ్నే అరుదైన ఘనత

దీంతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మార్నస్ లాబుస్చాగ్నే అరుదైన ఘనత సాధించాడు. సవరించిన నిబంధనల ప్రకారం కాంకషన్ సబిస్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్‌తో పాటు బౌలింగ్, బ్యాటింగ్ చేసే అవకాశాన్ని కల్పించింది. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు వర్షం అడ్డు తగలడంతో తొలిరోజు ఆట సాధ్యపడలేదు. ఆ తర్వాత ఉత్కంఠ భరితంగా సాగి చివరికు డ్రాగా ముగిసింది.


For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, August 20, 2019, 13:15 [IST]
Other articles published on Aug 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X