WATCH: చాహల్‌ని చూసి పారిపోయిన ధోని (వీడియో)
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ ధోని భారత జట్టుకు కెప్టెన్ అయిన తర్వాత ఎన్నో సార్లు పలు ఇంటర్యూల్లో మాట్లాడాడు. అయితే, ధోనిని ఓ వ్యక్తి ఇంటర్వ్యూ అడిగితే నీకో దండం అంటూ పారిపోయాడు. ఇటీవలి కాలంలో టీమిండియా మ్యాచ్‌లు ముగిసిన తర్వాత చైనామన్ స్పిన్నర్ చాహల్ సహచర ఆటగాళ్ల ఇంటర్యూలు చాహల్ టీవీ పేరిట తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
'చాహల్ టీవీ' పేరిట
ఈ ఇంటర్వ్యూలను బీసీసీఐ 'చాహల్ టీవీ' పేరిట తన ఖాతాలో అభిమానులతో పంచుకుంటోంది. అయితే, ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా సోమవారం న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ విజయనాంతరం తన టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వమని చాహల్.. ధోనీని అడిగితే అతడు పారిపోయాడు.
ధోనీ ముందు పరుగెత్తుతుండటం
న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో వన్డే తర్వాత ధోనీ ముందు పరుగెత్తుతుండటం, అతని వెనుక చాహల్ పరుగెత్తడం టీవీల్లో కనిపించింది. ఓవైపు విజయ్ శంకర్‌తోపాటు పాండ్యా, కేదార్ జాదవ్ ట్రోఫీతో పోజులిస్తుండగా.. ఆ పక్క నుంచి ధోనీ పారిపోవడం కనిపిస్తుంది. ధోనీ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడంతో తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను చాహల్ ఇంటర్యూ చేశాడు.

న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయాన్ని
ఇందులో భాగంగా తొలుత న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారంటూ రోహిత్‌ను ముందుగా చాహల్ అడిగాడు. అదే సమయంలో తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చమంటూ రోహిత్ శర్మకు విజ్ఞప్తి చేశాడు. టీ20 సిరిస్‌కు సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతని స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలంటూ కోరాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతావా
"కివీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో నన్ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దింపుతావా రోహిత్ భయ్యా. కోహ్లి గైర్హాజరీ కారణంగా ఆ స్థానాన్ని నాకు కేటాయించు" అని చాహల్ జోక్ చేశాడు. దీనికి రోహిత్ శర్మ కూడా తనదైన శైలిలో బదులిచ్చాడు. "నాల్గో వన్డేలో నువ్వు టాప్ స్కోరర్‌గా నిలిచావ్. అంతవరకూ ఓకే కానీ ఆ మ్యాచ్ ఓడిపోయింది కదా. అయినా నీ విజ్ఞప్తిని పరీశిలిస్తాం. నిన్ను మూడో స్థానంలో పంపడానికి కోచ్ రవిశాస్త్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా" అని సరదాగా బదులిచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications